Balakrishna : హిందూపురంలో బాలకృష్ణ నామినేషన్ కు రంగం సిద్ధం
- Author : Latha Suma
Date : 12-04-2024 - 3:58 IST
Published By : Hashtagu Telugu Desk
Balakrishna: ఏపీ(Ap)లో సార్వత్రిక ఎన్నికల(General Elections)కు ఈ నెల 18న నోటిఫికేషన్(Notification) విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో, టీడీపీ(tdp) పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)నామినేషన్ (Nomination)వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 19న ఆయన హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచార బరిలో దిగనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బాలయ్య కదిరి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అనంతరం, ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు.
Read Also: YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల
కాగా, ఏపీలో ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న సంగతి తెలిసిందే.