HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Avuku Iti College In The Former Sub Jail Students Need A Separate College Building

Avuku ITI : అక్కడ ఐటీఐ విద్యార్థులంతా జైలుకే.. ఎందుకు ?

నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది.

  • Author : Pasha Date : 06-02-2025 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Avuku Iti College In Sub Jail Nandyal Andhra Pradesh Min

Avuku ITI : అక్కడ విద్యార్థులు ఐటీఐ కోర్సు చదవాలంటే.. జైలులోకి వెళ్లాల్సిందే. ఔను.. మీరు విన్నది నిజమే. ఈ పరిస్థితి ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా అవుకులో ఉంది. అక్కడి ఐటీఐ గురించి ఈ కథనంలో మనం తెలుసుకుందాం..

Also Read :40000 Resignations : సంచలనం.. 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామాలు

గొంతెత్తని ప్రజాప్రతినిధులు 

నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (Avuku ITI ) ఉంది. దీన్ని 2008 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ ఈ కాలేజీని అవుకులో ఉన్న బ్రిటీష్ కాలపు సబ్ జైలు భవనంలో నిర్వహిస్తున్నారు. బ్రిటీష్ వాళ్లు  దశాబ్దాల కిందట నిర్మించిన ఈ జైలుభవనం బాగా పాతబడి, శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా అందులోనే ఐటీఐ విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వాలు మారుతున్నా..ఈ కాలేజీకి మాత్రం సొంత భవనం నిర్మాణం జరగడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఈ అంశంపై బలంగా గొంతెత్తిన దాఖలాలు లేవు. దీంతో దాదాపు 360 మంది విద్యార్థులు ఈ సబ్ జైలు భవనంలోనే ఐటీఐ తరగతులను వినాల్సి వస్తోంది. గత్యంతరం లేకపోవడంతో అరకొర వసతుల మధ్యే అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు.

Also Read :Trump Vs Panama : పనామా కాల్వ‌పై నెగ్గిన ట్రంప్ పంతం.. అమెరికా నౌకలకు ఫ్రీ జర్నీ

స్మార్ట్ యుగం, టెక్ యుగం, ఏఐ యుగంలోనూ..

ఈ ఐటీఐ కాలేజీలోని ఒక్కో గది స్టోర్‌రూమ్‌లా అధ్వానంగా ఉంది. జైలు అవసరాల కోసం బ్రిటీష్ వాళ్లు నిర్మించిన  ఈ భవనంలోని భారీ సైజు గదులను రేకులు, అట్టముక్కలతో వేర్వేరు తరగతి గదులుగా విభజించుకున్నారు. స్మార్ట్ యుగం, టెక్ యుగం, ఏఐ యుగంలోనూ ఇలాంటి స్థితిలో ప్రభుత్వ కాలేజీలు మగ్గుతుండటం బాధాకరం.  అవుకు ఐటీఐ కాలేజీ భవన నిర్మాణం కోసం గతంలో అవుకు శివారులో ఉన్న కొండపై 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దీంతోపాటు రూ.6 కోట్ల నిధులను సైతం మంజూరు చేశారు. గత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల ఆ ఫండ్స్ వెనక్కి వెళ్లిపోయాయి. కనీసం ఇప్పటి కూటమి ప్రభుత్వమైనా కాలేజీకి సొంత భవనాన్ని నిర్మిస్తుందని ఆశాభావంతో అవుకు ఐటీఐ విద్యార్థులు, అధ్యాపకులు ఎదురు చూస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • avuku
  • Avuku ITI
  • Avuku Students
  • ITI College
  • ITI Students
  • Nandyal
  • Sub Jail

Related News

Rising COVID-19 cases in AP

COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5

  • 9 arrested in Guntur case involving the stripping of a woman.

    Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd