Araku Coffee : అరకు కాఫీకి ప్రత్యేక స్థానం – రామ్మోహన్ నాయుడు
Araku Coffee : తాజాగా ఈ కాఫీ ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు
- By Sudheer Published Date - 07:28 PM, Tue - 11 March 25

ఆంధ్రప్రదేశ్‌లోని అరకు వ్యాలీ (Araku Coffee) ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ తన సుగంధం, రుచితో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. తాజాగా ఈ కాఫీ ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Minister Rammohan Naidu) ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అరకు కాఫీ విశిష్టత గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు పార్లమెంట్ వద్ద ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ఓం బిర్లా(Speaker Om Birla)ను ఆయన కోరారు.
CRDA : అమరావతిలో రూ.40వేల కోట్ల పనులకు సీఆర్‌డీఏ గ్రీన్ సిగ్నల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అరకు కాఫీ రుచిని మెచ్చుకున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరకు వ్యాలీలోని ఆదివాసీ రైతులు సాగు చేసే ఈ కాఫీ ఆర్గానిక్ పద్ధతుల్లో పండించబడటమే కాకుండా, దాని రుచితో అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఏకలవ్య కాఫీ, అరకు ఎంబసీ వంటి బ్రాండ్లు గ్లోబల్ మార్కెట్‌లో నిలదొక్కుకున్నాయి. ఈ అరకు కాఫీ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎగుమతులను పెంచేందుకు, మరిన్ని మార్కెట్ అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి అని సూచించారు. ఇది రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా, స్థానిక గిరిజన రైతుల జీవనోపాధికి ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు అవసరం అని నాయుడు అభిప్రాయపడ్డారు.