APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 1500కు పైగా పోస్టులకు నోటిఫికేషన్..
ఆగస్టు 15, 2025 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని APSRTC డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్ పరీక్షలో పాల్గొని ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
- By Latha Suma Published Date - 09:31 AM, Mon - 4 August 25

APSRTC : ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రయాణ సదుపాయాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ప్రణాళికను ముందే ముందుగా అమలు చేయడానికి APSRTC కీలకమైన చర్యగా కొత్త డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 15, 2025 నుండి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అభ్యర్థులు నేరుగా సమీపంలోని APSRTC డిపోకి వెళ్లి డ్రైవింగ్ టెస్టు, ఫిజికల్ పరీక్షలో పాల్గొని ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
APSRTC డ్రైవర్ పోస్టుల వివరాలు:
పోస్టు పేరు: డ్రైవర్
విభాగం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)
ఖాళీలు: 1500కి పైగా
పని ప్రదేశం: ఏపీ అంతటా
అర్హత: కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత
వయోపరిమితి: 22–35 ఏళ్లు
SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్లు వయో సడలింపు
ఎక్స్ సర్వీస్ మెన్‌కు గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు
అనుభవం: కనీసం 18 నెలల హెవీ వెహికల్ డ్రైవింగ్ అనుభవం
డ్యూటీ విధానం: ఆన్-కాల్లు (తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తారు)
జీతం: APSRTC నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది
అర్హతలు:
విద్యార్హత: కనీసం పది తరగతి ఉత్తీర్ణత ఉండాలి
డ్రైవింగ్ అనుభవం: హెవీ మోటార్ వెహికల్ HMV లైసెన్స్‌తో పాటు కనీసం 18 నెలల అనుభవం
ఫిజికల్ స్టాండర్డ్స్:
కనీస ఎత్తు 160 సెం.మీ (5.2 అడుగులు)
శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి
తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం వచ్చాలి
అవసరమైన డాక్యుమెంట్లు:
డిపోకి వెళ్లేటప్పుడు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు:
మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం
10వ తరగతి మెమో
HMV లైసెన్స్ (వ్యాలిడ్ అయి ఉండాలి)
ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (RTO ద్వారా జారీ చేయబడినది)
కుల సర్టిఫికెట్ (ఉంటే మాత్రమే)
ఎక్స్ సర్వీస్ సర్టిఫికెట్ (ఉంటే మాత్రమే)
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగానికి రాత పరీక్ష ఉండదు. మొత్తం మూడు దశల్లో ఎంపిక జరుగుతుంది:
డ్రైవింగ్ టెస్టు: ట్రాన్స్‌పోర్ట్ అధికారులు అభ్యర్థుల డ్రైవింగ్ సామర్థ్యాన్ని అంచనా వేస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు: ఆరోగ్య పరిస్థితి, ఎత్తు తదితర అంశాలను పరిశీలిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించి ఎంపికను ఖరారు చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు డిపోలో రిజిస్టర్ చేయబడతారు. అవసరమయ్యే సమయాల్లో ఈ ఉద్యోగులను “ఆన్ కాల్” విధానంలో పిలుస్తారు. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు, అయితే ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశంగా భావించవచ్చు.
అప్లికేషన్ ప్రక్రియ:
ఈ ఉద్యోగానికి ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మీకు సమీపంలోని APSRTC డిపోకి వెళ్లడం పై పేర్కొన్న డాక్యుమెంట్లను తీసుకెళ్లడం. అక్కడే డ్రైవింగ్, ఫిజికల్ టెస్ట్‌లు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావడం.
ముఖ్యమైన అంశాలు:
రాసే పరీక్ష లేదు.
10వ తరగతి అర్హతతో మంచి అవకాశం.
గ్రామీణ అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం.
ఆన్లైన్ అప్లికేషన్ లేకపోవడం వల్ల ఎక్కువ మందికి సులభం.
ఎంపిక పూర్తిగా స్కిల్ ఆధారంగా జరుగుతుంది. కాగా, ఈ నియామక ప్రక్రియ ముఖ్యంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి కీలకమైంది. డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ సంస్థలో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు.
Read Also: Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు