AP: ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..!!
- Author : hashtagu
Date : 31-10-2022 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల అవసరాలను అవకాశాలను నెలబెట్టలేని ఎమ్మెల్యే ఉద్యోగం, మంత్రి పదవి ఎందుకంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం ఉంటే ఉండనీ పోతే పోనీ కానీ మన అవకాశాలను జారవిడుచుకోవద్దు. బాద్యత లేకుండా ఉండకూడదు. తాను రాజధానికి కట్టుబడి ఉన్నానని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వం మీవెనకాలే ఉంటుంది. మంత్రి ఉండి పోరాడాలని చెప్పారని మంత్రి తెలిపారు. నేనెవరికీ భయపడను. నేను చేయాల్సిన పనులను చేస్తాను. చంద్రబాబు రాజధాని విషయంలో జరిగిన మోసం పై అసెంబ్లీలో అడిగితే ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను దోచుకున్న దొంగలు అస్సలు భయపడరన్నారు. రాజధాని వద్దంటూ ఉత్తరాంధ్రులను చంద్రబాబు హేలన చేస్తున్నారంటూ మంత్రి ధర్మాన ఫైర్ అయ్యారు.