HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Local Body Elections In Six Months

ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు

  • Author : Vamsi Chowdary Korata Date : 14-03-2026 - 10:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Local Body Elections in 6 Months
Local Body Elections in 6 Months

Andhra Pradesh CM Chandrababu Naidu  ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్‌ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తామని, ఏ ఎన్నిక జరిగినా కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గాలు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ద్వారా కొలువుదీరాయి. వీరి ఐదేళ్ల పదవీకాలం 2026 మార్చి-ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని, 2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్ 2న రహస్య నివేదికలు (కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యాల సాధన, దస్త్రాల పరిష్కారం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చూపిన చొరవ ఆధారంగా ఈ రిపోర్టులు ఉంటాయని వివరించారు. మంత్రులు సచివాలయానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావాలని సూచించారు.

అయితే, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు మంత్రుల వైఖరిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. “మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా?” అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకోవడంలో మంత్రులు వెనుకబడ్డారని, సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే మెరుగైన ఫలితాలు సాధించలేమని హెచ్చరించారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా ప్రచారం చేయాలని మంత్రి నారా లోకేశ్ కూడా ఇదే సందర్భంగా సూచించడం గమనార్హం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2026 AP Local Body Elections
  • 2026 Local elections
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Andhrapradesh Govt
  • ap local body elections
  • AP Local Body Elections Date
  • Local Body Elections
  • Local Body Elections in AP
  • local elections

Related News

Andhra Pradesh Dwcra Womens

AP DWCRA Women: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్..

ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళల కుమార్తెలకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద వివాహాల కోసం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రూ.లక్ష వరకు రుణం అందిస్తారు. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్

    Latest News

    • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

    • Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

    • Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

    • Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్

    • హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

    Trending News

      • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

      • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

      • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd