HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Liquor Scam Raj Kasireddys Investigation Is Complete What Did The Sit Officials Asked

Raj Kasireddy : రాజ్‌ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?

పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు. 

  • Author : Pasha Date : 22-04-2025 - 7:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Liquor Scam Raj Kasireddy Ap Sit Officials Ysrcp Ys Jagan

Raj Kasireddy : వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కసిరెడ్డి విచారణ ముగిసింది. ఇవాళ ఆయనను ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) అధికారులు గంటల కొద్దీ ప్రశ్నించారు. ఈ కేసుతో ముడిపడిన చాలా అంశాలపై ప్రశ్నలు అడిగారు. కీలక వివరాలను రాబట్టారు.  ఆ సమాచారంతో రిమాండ్‌ రిపోర్టును సిట్‌ అధికారులు రెడీ చేశారు. విచారణ ముగిసిన అనంతరం కసిరెడ్డిని పోలీసులు సిట్‌ కార్యాలయం నుంచి విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం రాజ్‌ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. జడ్జికి రిమాండ్ రిపోర్టును అందించారు. రాజ్‌ కసిరెడ్డిని మరిన్ని రోజుల పాటు తమ రిమాండ్‌కు అప్పగించాలని కోరారు.  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. మెరిట్స్‌ను పరిశీలించి రిమాండ్ విధింపుపై న్యాయమూర్తి తీర్పు ఇస్తారు.

Also Read :Civils Toppers: సివిల్స్‌ టాప్‌-5 ర్యాంకర్ల నేపథ్యం ఇదీ

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏమైందంటే.. 

సోమవారం సాయంత్రమే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేష్ రెడ్డి అనే పేరుతో గోవా నుంచి వచ్చిన రాజ్ కసిరెడ్డి.. పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే కసిరెడ్డి కదలికలను ఏపీ పోలీసులు హైటెక్ నిఘాతో ట్రాక్ చేశారు. విమానాశ్రయంలోని ఎరైవల్ బ్లాక్ వద్ద కాపు కాశారు. పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు.  శంషాబాద్ విమానాశ్రయ పోలీసు సిబ్బంది సహకారంతో ఎయిర్ పోర్టులోకి వెళ్లిన పోలీసులు రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న 24 గంటల్లోగా  కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నందున, మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో జడ్జి ఎదుట హాజరుపరిచారు.

Also Read :Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ

ఆధారాలను చూపిస్తూ ఆరా.. 

సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు సహా ఏడుగురు అధికారుల బృందం కసిరెడ్డిని ప్రశ్నలు అడిగింది. వైఎస్సార్ సీపీ పాలనా కాలంలో జరిగిన లిక్కర్ స్కాంపై  కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించగా..  ‘‘నాకు వసూళ్ల నెట్‌వర్క్‌తో లింకు లేదు’’ అని తేల్చి చెప్పాడట. గతంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి(Kasireddy) ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా కసిరెడ్డికి అధికారులు ప్రశ్నలు వేశారట. పలు ఆధారాలను ముందుపెట్టి, వాటిని చూపిస్తూ సిట్ అధికారులు అతడిని ప్రశ్నలు అడిగారట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Liquor Scam
  • AP SIT
  • crime
  • Kasireddy Rajasekhar Reddy
  • liquor scam
  • Raj Kasireddy
  • SIT officials
  • ys jagan
  • ysrcp

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

  • government-gives-green-signal-for-prosecution-of-kodali-nani

    Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • Key turn in AP liquor scam case... Former Minister Karumuri's son arrested.

    Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

Latest News

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd