HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Civil Services Results Are Out This Is The Background Of The Top 5 Rankers

Civils Toppers: సివిల్స్‌ టాప్‌-5 ర్యాంకర్ల నేపథ్యం ఇదీ

సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలో శక్తి దూబే(Civils Toppers) పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌‌ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.

  • By Pasha Published Date - 07:10 PM, Tue - 22 April 25
  • daily-hunt
Civil Services Results Top 5 Rankers Top 5 Civils Rankers Civils Toppers

Civils Toppers: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్‌ 2024 ఫలితాలపై అంతటా చర్చ జరుగుతోంది. ఈసారి ఫలితాల్లో మహిళామణులు సత్తా చాటారు. టాప్ – 25 ర్యాంకుల్లో 11 ర్యాంకులను వనితలే కైవసం చేసుకున్నారు. నంబర్ 1 ర్యాంకర్‌గా శక్తి దూబే నిలిచారు. నంబర్ 2 స్థానం హర్షిత గోయల్‌, నంబర్ 4 స్థానం షా మార్గి చిరాగ్‌ కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టాప్‌ 5 ర్యాంకర్ల వివరాలను మనం తెలుసుకుందాం..

Also Read :Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ

నంబర్ 1 

  • శక్తి దూబే సివిల్స్‌లో నంబర్ 1 ర్యాంకు సాధించారు.
  • ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు.
  • అలహాబాద్‌ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో డిగ్రీ పొందారు.
  • బనారస్‌ హిందూ యూనివర్సిటీలో బయో కెమిస్ట్రీలో పీజీ చేశారు.
  • 2018 నుంచి ఆమె సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు.
  • సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలో శక్తి దూబే(Civils Toppers) పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌‌ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.

నంబర్ 2

  • హర్షిత గోయల్‌ సివిల్స్‌లో నంబర్ 2 ర్యాంకు సాధించారు.
  • ఆమె హర్యానా వాస్తవ్యురాలు. అయితే వారి కుటుంబం చాలా ఏళ్లుగా గుజరాత్‌లోని వడోదరలో నివసిస్తోంది.
  • హర్షిత ప్రొఫెషనల్ రీత్యా సీఏ.
  • బరోడా యూనివర్సిటీలో బీ.కాం చేశారు.
  • ఆమె సివిల్స్‌లో పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.

నంబర్ 3 

  • అర్చిత్‌ పరాగ్‌ డోంగ్రే సివిల్స్‌లో నంబర్ 3 ర్యాంకు సాధించారు.
  • ఆయన పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు మహారాష్ట్రలో జరిగింది.
  • తమిళనాడులో ఉన్న వేలూర్ వీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేశారు.
  • సివిల్స్‌లో ఫిలాసఫీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
  • 2023లోనూ అర్చిత్ సివిల్స్ పరీక్ష రాయగా.. 153వ ర్యాంకు వచ్చింది. అయితే అంతకంటే బెటర్ ర్యాంకును అర్చిత్ కోరుకున్నారు. ఈసారి ఫలితాల్లో సాధించారు.

Also Read :KTR : నర్సింగ్‌లాంటి కార్యకర్తలుంటే కాంగ్రెస్ కుట్రలు సాగవు : కేటీఆర్

నంబర్ 4

  • మార్గి చిరాగ్‌ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వాస్తవ్యురాలు.
  • ఆమె ఈసారి సివిల్స్ ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించింది.
  • ఆమె విద్యాభ్యాసం అంతా గుజరాత్‌లోనే జరిగింది.
  • కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశారు.
  • సివిల్స్‌లో సోషియాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
  • ఈమె వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు. గత నాలుగేళ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది.
  • ఇంతకుముందు ఆమె UPSCకి ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ ఎంపిక కాలేదు.
  • అయినా పట్టుదలతో కృషి చేసి..  ఈసారి ఫలితాల్లో మార్గి చిరాగ్ షా సత్తా చాటుకుంది.

నంబర్ 5

  • ఆకాశ్‌ గార్గ్‌ ఈసారి సివిల్స్ ఫలితాల్లో 5వ ర్యాంకు సాధించారు.
  • ఈయన ఢిల్లీలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అక్కడే జరిగింది.
  • ఆకాశ్ ఢిల్లీలోని గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశారు.
  • సివిల్స్ మెయిన్స్ పరీక్షలో సోషియాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
  • ఆకాశ్‌ తండ్రి ఉత్తరాఖండ్‌లో టూరిజం బిజినెస్ చేస్తుంటారు.
  • ఓ వైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే, మరోవైపు వ్యాపారంలో తన తండ్రికి ఆకాశ్ హెల్ప్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • civil services
  • civils results
  • civils toppers
  • jobs
  • Top 5 Civils Rankers
  • Top 5 Rankers

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd