HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Task Force Checks Big Pushpas Are Coming Into Light Huge Reserves Of Red Sandalwood

Big Pushpas : బిగ్ ‘పుష్ప’లు.. రహస్య స్థావరాల్లో భారీగా ఎర్రచందనం దుంగలు!

ఇటీవలే ఏపీ టాస్క్‌ఫోర్స్‌కు స్మగ్లర్లు రాంప్రసాద్‌, రవిశంకర్‌(Big Pushpas) దొరికిపోయారు.

  • Author : Pasha Date : 27-01-2025 - 8:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Pushpas Red Sandalwood Andhra Pradesh Govt Task Force

Big Pushpas : కొందరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పుష్పను మించిన రేంజులో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గరున్నా ఎర్రచందనం నిల్వల కన్నా, ఆయా స్మగ్లర్ల గోదాముల్లో సీక్రెట్‌గా దాచిన స్టాకే ఎక్కువని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం  ఏపీలోని తిరుపతి పరిధిలో తిమ్మినాయుడుపాలెం వద్దనున్న ఎర్రచందనం సెంట్రల్‌ గోదాములో దాదాపుగా 5,400 టన్నుల ఎర్రచందనం నిల్వ ఉంది. దీనికంటే ఎన్నోరెట్లు ఎక్కువ స్టాక్ స్మగ్లర్ల వద్ద ఉందనే ప్రచారం జరుగుతోంది.  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రహస్య స్థావరాల్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు దాచారని తెలుస్తోంది.

Also Read :Vijayasai Reddy : వైసీపీలో విజయసాయిరెడ్డి ప్లేస్‌ ఆ యువనేతకేనా ? జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

ఏపీ టాస్క్‌ఫోర్స్ వలకు దొరికిపోతున్నారు

  • కరోనా సమయంలో అలుముకున్న ఆర్థిక సంక్షోభం నుంచి చైనాలోని పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అందుకే అక్కడి నుంచి ఎర్రచందనం కోసం భారతదేశంలోని స్మగ్లర్లకు ఆర్డర్లు వస్తున్నాయట. ఈవిషయాన్ని ఏపీ ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ విభాగం గుర్తించింది.  దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రహస్య స్థావరాల్లో దాచిన ఎర్రచందనం దుంగలను బయటికి తీస్తున్నారట. వాటిని వివిధ రహస్య మార్గాల్లో స్మగ్లింగ్‌ చేస్తున్నారని గుర్తించారు.
  • ఇటీవలే ఏపీ టాస్క్‌ఫోర్స్‌కు స్మగ్లర్లు రాంప్రసాద్‌, రవిశంకర్‌(Big Pushpas) దొరికిపోయారు. వారిని విచారించగా ఎర్రచందనం స్మగ్లింగ్‌తో ముడిపడిన చాలా విషయాలను వెల్లడించారు.  వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్సు అధికారులు సోదాలు చేసి రూ.3.5  కోట్లు విలువైన 155 దుంగలను రహస్య స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌కు చెందిన ఉత్తంకుమార్‌, నందకిశోర్‌, సోనీ, జోషి హన్స్‌రాజ్‌, మీర్జాయి, పరేష్‌జి అనే అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు.
  • తమిళనాడులోని ఓ గోదాములో దాచిన ఎర్రచందనాన్ని అసోంకు తరలిస్తుండగా ఏపీ టాస్క్‌ఫోర్సు సిబ్బంది చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో పట్టుకున్నారు. అక్కడ స్వాధీనం చేసుకున్న 413 ఎర్రచందనం దుంగల విలువ  రూ.4.5 కోట్లు ఉంటుంది. తమిళనాడుకు చెందిన నరేంద్రకుమార్‌, అసోంకు చెందిన బినోయ్‌కుమార్‌, రాజస్థాన్‌కు చెందిన విజయ్‌ జోషీని అదుపులోకి తీసుకున్నారు.

Also Read :Red Light Therapy: రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి? ఈ చికిత్స దేనికి ఉప‌యోగిస్తారు?

భారత్ ఎర్రచందనంతో చైనాలో ఏం చేస్తారు ?

కరోనా సమయంలో అలుముకున్న ఆర్థిక సంక్షోభం నుంచి చైనాలోని పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అందుకే అక్కడి నుంచి ఎర్రచందనం కోసం భారతదేశంలోని స్మగ్లర్లకు ఆర్డర్లు వస్తున్నాయట. భారత్‌లో లభించే ఎర్రచందనాన్ని ప్రధానంగా చైనాకు స్మగ్లింగ్ చేస్తుంటారు. ఎందుకంటే.. అక్కడ దానితో ఫర్నీచర్, బొమ్మలు, వస్తువులు తయారు చేస్తారు. వాటిని జపాన్‌, థాయ్‌లాండ్‌, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ దేశాలను అవి ఐరోపా దేశాలకు చేరుతుంటాయి. ఐరోపా దేశాలకు చేరే సరికి.. ఎర్రచందనంతో తయారు చేసిన ఆయా సామగ్రి ధర అమాంతం పెరిగిపోతుంటుంది.  అందుకే అంత రేంజులో ఎర్రచందనానికి ధర పలుకుతుంటుంది. కిలోకు దాదాపు రూ.6వేలకు ఎర్ర చందనాన్ని విక్రయిస్తుంటారు. భారీ సైజులో ఉండే ఒక ఎర్ర చందనం దుంగ ధర దాదాపు రూ.20 లక్షల దాకా ఉంటుందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • ap govt
  • AP Task Force
  • Big Pushpas
  • crime
  • Red Sandalwood

Related News

Cancer Cases In Ap

ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని ఏళ్లుగా క్యాన్సర్ కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. 2021 నుండి 2025 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.6 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి

  • Ysrcp Protest Parliament

    ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

  • Chandrababu Skill Case

    చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Latest News

  • అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్నారంటూ పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు!

  • తొందర పడొద్దంటూ చంద్రబాబు, పవన్ నిర్ణయం

  • ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • సీఎం రేవంత్ బినామీ కంపెనీకి రూ.6వేల కోట్ల పనులు – కేటీఆర్ సంచలన ఆరోపణలు

  • పవన్ కళ్యాణ్ చెపితే తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారా ? – TPCC చీఫ్ మహేష్

Trending News

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd