AP CS: ఏపీ సీఎస్ సమీర్ శర్మకు గుండెపోటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు గుండెపోటు వచ్చింది. ఆయనకు గుండె సంబంధ చికిత్సను వైద్యులు
- Author : CS Rao
Date : 19-10-2022 - 2:03 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు గుండెపోటు వచ్చింది. ఆయనకు గుండె సంబంధ చికిత్సను వైద్యులు అందిస్తున్నారు. మంగళవారం అస్వస్థతకు గురై విజయవాడలోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మ గుండె సంబంధిత చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
సీఎస్ సమీర్ శర్మ కొద్దిరోజులుగా చికిత్స పొందుతారని, త్వరలో విధుల్లో చేరేందుకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తారని సమాచారం. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీకాలాన్ని ఈ ఏడాది మేలో మరో ఆరు నెలలు పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని నవంబర్ 30 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సీఎస్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. ఏపీలో ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన తొలి అధికారిగా సమీర్ శర్మ నిలిచారు