Kuppam : కుప్పంపై గురిపెట్టిన జగన్.. భారీగా నిధుల విడుదల
చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఎలాగైన వైసీపీ జెండా ఎగరేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది.
- Author : Prasad
Date : 10-08-2022 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
చంద్రబాబు ఇలాకా కుప్పంలో ఎలాగైన వైసీపీ జెండా ఎగరేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఇందుకోసం కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కార్యకర్తలతో తొలి సమావేశం కుప్పం నుంచే మొదలు పెట్టారు. సరిగ్గా పని చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో కూడా గెలుస్తామని ఆయన తన పార్టీ శ్రేణుల్లో మనోస్థైర్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చాలం కాలం నుంచే కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారించారు.
కుప్పం మునిసిపాలిటీలోని 25 వార్డుల్లో పనులకు రూ. 66 కోట్లను ఆయన మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వారం కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో జగన్ భేటీ అయిన సంగతి తెలిసిదే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానమని అన్నారు. కుప్పంపై ప్రత్యేక దృష్టిని సారిస్తానని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే ఇప్పుడు భారీగా నిధులను విడుదల చేశారు.