HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cm Jagan Review On Helath Department

AP CM Jagan : వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. ఆరోగ్య‌శ్రీ కింద వైద్య చికిత్స‌ల సంఖ్య పెంపు

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వైద్య ఆరోగ్య‌శాఖపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సమావేశంలో మంత్రి విడదల...

  • Author : Prasad Date : 28-10-2022 - 10:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Jagan Imresizer
Cm Jagan Imresizer

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో వైద్య ఆరోగ్య‌శాఖపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సమావేశంలో మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కు పెంచుతూ సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీతో 809 కొత్త వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అంకితభావంతో అమలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎంప్యానెల్డ్ ఆసుపత్రులపై నమ్మకం, విశ్వాసం ఉందని, ఇప్పుడు రోగులకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, 104 కాల్ సెంటర్ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలను కూడా అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఆరోగ్యశ్రీ కింద అందజేసే సేవలపై ఎంప్యానెల్డ్, విలేజ్ క్లినిక్‌లు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. పూర్తి సమాచారంతో కూడిన బుక్‌లెట్లను కూడా ఇస్తున్నారు. ఆసుపత్రులు అందిస్తున్న సేవల వివరాలను కూడా ఇందులో ఉంచినట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఇతర రాష్ట్రాలకు చెందిన వారు గాయపడితే వెంటనే వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య మిత్రలకు సేవా మిత్ర, సేవా రత్న, ఆరోగ్య సేవా అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు.

వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. ఆరోగ్యశ్రీలో పెంచిన వైద్య చికిత్సలను ప్రారంభించిన సీఎం.
ఆరోగ్య శ్రీ కింద 3,255కి చేరిన వైద్య చికిత్సలు. కొత్తగా 809 చికిత్సలు పెంపు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య 1059 నుంచి 3,255కు పెంపు. pic.twitter.com/C1QFoCEp2Y

— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 28, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh health department
  • AP CM Jagan
  • AP Health minister Vidadala Rajini
  • cmo andhra pradesh

Related News

9 arrested in Guntur case involving the stripping of a woman.

Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, తీవ్రంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణాబాబు కాలనీకి చెందిన బాధితురాలు తన ఇంటి తాగునీటి పైప్‌లైన్‌కు నీళ్ల మోటారును అమర్చుకోగా, స్థానిక నిందితుడైన మల్లెల వెంకట రమణమూర్తి ఆమెను రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆమె భర్త నిరాకరించడంతో, రమణమూర్తి అధికారులతో మాట్ల

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

  • Egg prices skyrocket... hitting record levels.

    Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

Latest News

  • Kuwait desalination plant: ఇరాన్ దాడి తర్వాత కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం..

  • Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద దాడికి గల 4 కారణాలు ఇవే

  • SSRajamouli: వారణాసి సినిమాలో పీవీ సింధు

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd