AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు షాక్..
AP News : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుపై వడివడిగా నిర్ణయం తీసుకుంది.
- By Kavya Krishna Published Date - 06:29 PM, Mon - 30 June 25

AP News : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుపై వడివడిగా నిర్ణయం తీసుకుంది. నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన 800 మెగావాట్ల అవుకు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు గతంలో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కేటాయించిన ప్రాజెక్టు హక్కులను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) పూర్తిచేయడంలో గణనీయమైన జాప్యం చోటు చేసుకోవడం, అలాగే పనుల్లో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడమే రద్దుకు ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. అప్పటికే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఈ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు పై సంక్షిప్త సమీక్ష జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Sama Ram Mohan Reddy : బీజేపీ-బీఆర్‌ఎస్ పొత్తుకు తొలి అడుగు పడింది..
ఈ నేపథ్యంలో, ప్రాజెక్టు రద్దుకు సంబంధించి ‘న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (NREDCAP)’కి సంబంధిత తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యంగా, సంస్థ వైస్ చైర్మన్ & ఎండీకి ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సంతకం చేశారు. తాజా నిర్ణయం ద్వారా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి మరింత పారదర్శకత, సమర్థత ఉన్న విధానాల అమలుకు కూటమి ప్రభుత్వం నడుం కట్టినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ పరిణామం పెట్టుబడిదారులకు, పునరుత్పాదక విద్యుత్ రంగానికి స్పష్టమైన సంకేతాలను పంపిస్తుందని, ఇకపై ప్రతీ ప్రాజెక్టుపై సమయపాలన, పనితీరు కీలకమవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి.
Minister Narayana : రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు