AP Cabinet : ఈ నెల 16న ఏపి క్యాబినెట్ భేటి
- By Latha Suma Published Date - 03:46 PM, Tue - 9 July 24

AP Cabinet : ఈ నెల 16న ఏపిలో కూటమి ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం(Cabinet meeting) కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైనా ఈ భేటిలో రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 16న జరిగే క్యాబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జులై 31 వరకు ఉంటుంది. దాంతో, ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అంతేకాక 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు చర్చించే అంశాలు శాఖల వారీగా ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జూన్ 11 తేదీ ఎందుకంటే.. సరిగ్గా ఆ తేదీతో.. ప్రభుత్వం ఏర్పడి నెల పూర్తవుతుంది. దీన్ని ప్రభుత్వం అన్నీ ప్లాన్ ప్రకారం చేస్తోందని అనుకోవచ్చు. సరిగ్గా నెల రోజుల పాలన ఎలా ఉందో కేబినెట్‌లో చర్చిస్తారని అర్థమవుతూనే ఉంది.
Read Also: Electricity Bill Payment : TGSPDCL, TGNPDCL యాప్స్, వెబ్‌సైట్స్‌లో కరెంటు బిల్లు కట్టడం ఇలా..
మరోవైపు ఈనెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. మొత్తం 5 రోజులు నిర్వహిస్తారని టాక్ వస్తోంది. ఐతే.. తేదీలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి రోజు రెండు సభలనూ ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ సమావేశాల్లో పూర్తి బడ్జె్ట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇంకా సమీక్ష పూర్తికాలేదు. ఎన్నికల ముందు ఓట్ ఓన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్సు తెచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి బడ్జెట్ తెస్తారనే అంచనా ఉంది. దీనిపై కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తారని సమాచారం.
Read Also: Manchu Brothers : మంచు బ్రదర్స్ మధ్య ఏం జరుగుతుంది..?