AP Cabinet : ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు ఇవే!
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
- Author : Latha Suma
Date : 16-07-2024 - 3:18 IST
Published By : Hashtagu Telugu Desk
AP Cabinet: నేడు ఏపీలో వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం(Cabinet meeting) ముగిసింది. ఈ భేటిలో పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానం అమలుకు ఆమోదం లభించింది. నూతన ఇసుక పాలసీ అమలు కోసం త్వరలోనే విధివిధానాలు రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి ఆమోదం లభించింది.
We’re now on WhatsApp. Click to Join.
రైతుల నుండి ధాన్యం కొనుగోలుకు ఎన్సీడీసీ నుండి రేఊ.3,200 కోట్ల రుణానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రుణం తీసుకునేందుకు వ్యవసాయ, సహకార కార్పొరేషన్‌కు ప్రభుత్వ గ్యారంటీకి క్యాబినెట్ అనుమతి తెలిపింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు, విధివిధానాల ఖరారుకు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. ఈ కమిటీలో అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ ఉన్నారు. రెండ్రోజుల్లో చర్చించి, అధికారులతో మాట్లాడిన ఒక నిర్ణయానికి రావాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కాగా, ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా? లేక, ప్రభుత్వం చెల్లించాలా? అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటికి నిర్దేశించారు. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇక, ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అంతేకాక సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది.
Read AlsoRahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్‌గాంధీ