Sharmila : కడపలో వైఎస్ షర్మిల వెనకంజ
- Author : Latha Suma
Date : 04-06-2024 - 9:35 IST
Published By : Hashtagu Telugu Desk
AP Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు ఏపిలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసే సరికి 2274 ఓట్ల లీడ్ లో ఉన్నారు. కడప రాజకీయమంతా వైఎస్ వివేకానందారెడ్డి హత్య చుట్టే సాగింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వడం సహించలేక తాను కడప నుంచి బరిలోకి దిగుతున్నట్లు షర్మిల ప్రకటించారు. వివేకా కూతురు వైఎస్ సునీత కూడా తన సోదరి షర్మిలకు మద్దతు పలికారు. కడప ఎంపీగా గెలిపించాలని ప్రజలను ఆమె అభ్యర్థించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు వైసీపీ నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. గజపతినగరంలో బొత్స అప్పలనర్సయ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదే సమయంలో, టీడీపీ అభ్యర్థులు మూడు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. రాజమండ్రి రూరల్ లో రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2,870 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. మరో వైపు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు.