HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Vande Bharat Express To Andhra Pradesh From 12th Of March

Vande Bharat – AP : 12 నుంచి ఏపీకి మరో ‘వందేభారత్’.. హాల్టింగ్ స్టేషన్లు ఇవీ

Vande Bharat - AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది.

  • Author : Pasha Date : 08-03-2024 - 8:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express
Tirumala Vande Bharat

Vande Bharat – AP : మరో వందేభారత్ రైలు ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ నెల 12 నుంచి అందుబాటులోకి రానుంది. భువనేశ్వర్‌ – విశాఖ – భువనేశ్వర్‌ వందేభారత్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ రోజున వర్చువల్‌‌గా ప్రారంభించనున్నారు. ఈ రైలుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను ఇవాళ (శుక్రవారం) నిర్వహించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త వందేభారత్ ట్రైన్‌పై మరిన్ని వివరాలు ఇవీ..

We’re now on WhatsApp. Click to Join

  • ‘భువనేశ్వర్‌ – విశాఖ – భువనేశ్వర్‌’ వందేభారత్‌ రైలు సోమవారం మినహా వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుంది.
  • మొత్తం 443 కిలోమీటర్లు ఈ రైలు ప్రయాణిస్తుంది.
  • ప్రతిరోజు ఉదయం 5.15 గంటలకు భువనేశ్వర్‌ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. ఖుర్ధారోడ్‌‌కు 5.33 గంటలకు, బరంపూర్‌‌కు 7.05 గంటలకు, ఇచ్ఛాపురం‌నకు 7.18 గంటలకు, పలాసకు 8.18 గంటలకు, శ్రీకాకుళం రోడ్‌ (ఆముదాలవలస)కు 9.03 గంటలకు, విజయనగరంనకు 9.48 గంటలకు, విశాఖపట్నానికి ఉదయం 11 గంటలకు చేరుతుంది.
  • విశాఖపట్నం నుంచి సాయంత్రం 3.45 గంటలకు ఈ రైలు బయలుదేరుతుంది. విజయనగరంనకు 4.30 గంటలకు, శ్రీకాకుళం రోడ్‌కు 5.28 గంటలకు, పలాసకు 6.30 గంటలకు, ఇచ్ఛాపురంనకు 7.00 గంటలకు, బరంపూర్‌‌కు 7.20 గంటలకు, ఖుర్ధారోడ్‌‌కు 8.57 గంటలకు, భువనేశ్వర్‌‌కు 9.30 గంటలకు రైలు చేరుకుంటుంది.
  • ప్రతి రైల్వేస్టేషన్‌ వద్ద ఈ రైలు రెండు నిమిషాలు ఆగుతుంది.

Also Read : Political Entry : 15న వైఎస్ సునీతారెడ్డి సంచలన ప్రకటన..?

  • ప్రస్తుతం వందేభారత్‌ రైళ్ల బోగీలను చెన్నైలోని రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ సామర్థ్యం తక్కువగా ఉండటంతో వారానికి ఒక బోగీ మాత్రమే తయారవుతోంది.
  • రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్‌)ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు తొలుత అంగీకరించిన కేంద్రం.. ఆ తర్వాత మాట మార్చింది. కాజీపేటలో ఆర్‌సీఎఫ్‌ను ఏర్పాటు చేయడం లేదని ప్రకటించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది.
  • కాజీపేటలో ఆర్‌సీఎఫ్‌ను ఏర్పాటు చేసినట్టయితే వందేభారత్‌తోపాటు ఇతర రైళ్ల బోగీలను వేగంగా తయారు చేసేందుకు వీలయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణకు మొండిచెయ్యి

రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ రైళ్ల సంఖ్య ఏడాది దాటినా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏటా 100 వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తామని నిరుడు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటివరకు 50 రైళ్లను కూడా ప్రారభించలేదు. వందేభారత్‌ రైళ్ల విషయంలో కేంద్రం దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నది. ఉత్తర భారతావనిలోని వివిధ ప్రాంతాల మధ్య అనేక వందేభారత్‌ రైళ్లను నడుపుతున్న నరేంద్రమోడీ సర్కారు.. తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 రైళ్లను ప్రారంభించి చేతులు దులిపేసుకున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అత్యంత కీలకమైన హైదరాబాద్‌/సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు వందేభారత్‌ రైళ్లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

Also Read :Hyderabad: హైదరాబాద్‌లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • March 12th
  • Vande Bharat - AP
  • Vande Bharat Express

Related News

Cbn Speech

Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని ఫార్మా సిటీలోని దక్షిణ్ ఎనర్జీలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికుల మృతిపై సీఎం తన సంతాపం తెలియచేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ నుంచి మరొక అగ్న

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd