Political Entry : 15న వైఎస్ సునీతారెడ్డి సంచలన ప్రకటన..?
Political Entry : ఈ నెల 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి ఉంది.
- By Pasha Published Date - 07:52 AM, Fri - 8 March 24

Political Entry : ఈ నెల 15న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి ఉంది. ఆ రోజున వైఎస్ సునీతారెడ్డి తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులతో కడపలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశం వేదికగా రాజకీయ ప్రవేశంపై సునీతారెడ్డి కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు. ఈ మీటింగ్‌లో వైఎస్ సునీతారెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
రాజకీయాల్లోకి వచ్చేలా చేస్తున్న పరిస్థితులు, అందుకు దారితీసిన కారణాలను ఈసందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి అభిమానులకు వైఎస్ సునీతారెడ్డి వివరించనున్నారు. తండ్రి వివేకా హత్య.. సీబీఐ దర్యాప్తు, కుట్ర కోణాలు, ఆ తర్వాతి పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని ఆమె భావిస్తున్నారట. త్వరలో జరిగే ఎన్నికల్లో వివేకా భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ (Political Entry) చేయిస్తారనే చర్చ జరుగుతోంది. వీటన్నింటినీ ఆత్మీయ సమావేశంలో ప్రజలకు వైఎస్ సునీత వివరించే ప్రయత్నం చేయనున్నారట.
Also Read : Mahashivratri: ఈరోజే మహాశివరాత్రి.. ఇలా చేస్తే డబ్బుతో పాటు సుఖసంతోషాలు..!
న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత.. రాజకీయంగానూ యాక్టివ్ కావాలని అనుకుంటున్నారట. వాస్తవానికి ఈ ఆత్మీయ సమావేశాన్ని పులివెందులలోనే నిర్వహించాలని తొలుత వైఎస్ సునీతారెడ్డి భావించారు. పులివెందులలోని విజయ గార్డెన్స్‌ను ఎంపిక చేసి ఈ నెల 15కు సంబంధించిన అద్దెను కూడా కట్టారు. ఒప్పందం చేసుకున్నాక కొందరి ఒత్తిళ్లతో.. విజయ గార్డెన్స్ నిర్వాహకులు ఆ రోజుకు ఫంక్షన్ హాలు ఖాళీ లేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆత్మీయ సమావేశం వేదికను కడపకు సునీత మార్చుకున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించిన సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగాలని.. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇవ్వాలని కోరారు.
Also Read : Surekha Yadav: నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ గురించి తెలుసా..!
కుటుంబసభ్యులే నాకు వెన్నుపోటు పొడిచారు: షర్మిల
కుటుంబసభ్యులే తనకు వెన్నుపోటు పొడిచారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా లేకపోవడంపై ఆమె కంటతడి పెట్టుకున్నారు. ‘‘హోదా విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారు. ప్రత్యేక హోదా అనేది కాంగ్రెస్‌కు ఎన్నికల అంశం కానేకాదు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది. దాన్ని సాధించేందుకు అంతా పోరాడాలి’’ అని షర్మిల పిలుపునిచ్చారు.