Eluru : జగన్ కు మరో షాక్..టీడీపీ లోకి కీలక నేతలు
ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు
- By Sudheer Published Date - 10:18 AM, Mon - 26 August 24

ఏపీలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుస షాకులు తగులుతున్నాయి. గతంలో టీడీపీ వీడి వైసీపీ (YCP) లో చేరిన నేతలు , కార్యకర్తలు ఇలా అంత కూడా మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటాలను సైతం టీడీపీ బద్దలు కొట్టగా..ఇప్పుడు చిన్న చితక వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఏలూరు లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ దంపతులు (Eluru Mayor Noorjahan Couple ) మంగళవారం నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయం గురించి వారు ఇప్పటికే ఎమ్మెల్యే బడేటి చంటితో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరితో పాటు మరో 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్నారు. మరోవైపు మేయర్‌తో పాటు కార్పొరేటర్లు చేరితే ఏలూరు నగర పాలక సంస్థ టీడీపీ పరమవుతుందని అంతా భావిస్తున్నారు.
మేయర్ భర్త ఎస్‌ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ సమర్థత కలిగిన నాయకులని.. వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, ఎస్‌ఎంఆర్ పెదబాబు దంపతుల రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలైంది. 2013లో అప్పటి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి బుజ్జి.. నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఎంఆర్ పెదబాబును పార్టీలో చేర్చుకుని ఆయన సతీమణి నూర్జహాన్‌ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలిచి పీఠాన్ని అధిరోహించారు. అనంతర పరిణామాల్లో 2019 సాధారణ ఎన్నికలకు ముందు పెదబాబు దంపతులు వైసీపీలో చేరారు.
Read Also : Robbery Gangs : వామ్మో.. ఆ 3 గ్రామాలు.. దొంగల ముఠాల అడ్డాలు