HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Huge Industry For Ap

ఏపీకి మరో భారీ పరిశ్రమ

  • Author : Vamsi Chowdary Korata Date : 01-05-2026 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh
Andhra Pradesh

ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు క్యూ కట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో పెట్టుబడులు పెట్టేందుకు మరికొందరు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంతానికి మరో భారీ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ రాబోతోంది. శ్రీసత్యసాయి జిల్లాలో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ అత్యాధునిక సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ తయారీ కేంద్రంతో పాటు పవర్‌ డివైజ్‌ల కోసం ఔట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ టెస్టింగ్‌ సదుపాయం ప్లాన్ చేసింది. ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ ఇప్పటికే ముంబైలో ఓఎస్‌ఏటీ సదుపాయాన్ని పైలట్‌ విధానంలో నిర్వహిస్తోంది. ఈ పరిశ్రమ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద సెమీకండక్టర్‌ తయారీ పరిశ్రమ కానుంది.

ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న ఈ పరిశ్రమకు ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ కింద అనుమతులు పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ పరిశ్రమను రెండు దశల్లో పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినప్పటి నుంచి 25 నెలల్లో తొలిదశను పూర్తిచేయనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 1,017 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు తొలి దశ కోసం సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని టేకులోడు దగ్గర 30 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

మరోవైపు శ్రీసత్యసాయి జిల్లాకు భారీ ఏరోస్పేస్‌ పరిశ్రమ రాబోతోంది. పుట్టపర్తి సమీపంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కాలంలో శ్రీసత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్‌ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. అక్కడ డ్రోన్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ క్లస్టర్లు రాబోతున్నాయి. ఏరోస్పేస్ రంగంలో రాబోయే రోజుల్లో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఏరోస్పేస్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్న కంపెనీలకు అవసరమైన అనుమతులు, ప్రోత్సాహకాలు, ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నందుకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌ను సీఎం ప్రశంసించారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Chandrababu Naidu
  • Industry
  • Minister Nara Loeksh
  • Rrp Electronics
  • Sri Sathya Sai District

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • CM Chandrababu launches the book 'CBN@361 Degrees' in Singapore.

    Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Chandrababu

    Chandrababu Naidu: సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd