HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Cyclone Alert

Cyclone Alert : ముంచుకొస్తున్న మరో తుఫాన్ గండం ..

ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది

  • Author : Sudheer Date : 02-09-2024 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Another Cyclone
Another Cyclone

ఇప్పటికే వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు పడుతుండడంతో జనజీవనం , రవాణా వ్యవస్థ స్థంభించింది. ఊర్లకు ఊర్లే వరదలో కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాలు పంట పొలాలు నాశనమయ్యాయి. వందలాది ఇల్లులు నేలమట్టం అయ్యాయి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని వేడుకుంటున్నారు. ఇదిలా ఉండగానే మరో తూఫాన్ ముప్పు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై రెండు రోజుల్లో కచ్చితమైన సమాచారం వస్తుందని చెబుతున్నారు.

ఇక తెలంగాణ లో ప్రస్తుతం 45 పునరావాస కేంద్రాలను తెరచి, 2,500 మందికిపైగా తరలించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు. వరద తీవ్రత అధికంగా ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలతోపాటు సహాయసహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇటు విజయవాడకు పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నిన్న కేంద్రంతో చంద్రబాబు సహాయక చర్యల విషయమై మాట్లాడారు. పవర్ బోట్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏపీకి పంపించాలని కోరారు. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు కేంద్రం బోట్స్‌ను పంపించింది. మరోవైపు లుధీయానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో బొట్లతో విజయవాడ వరద ప్రాంతాల్లోకి వెళ్లాయి. సుమారు 100 మందితో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. బోట్స్ ద్వారా సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ చేయడం జరిగింది.

Read Also : Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Another cyclone
  • ap
  • telangana
  • telugu states

Related News

Pig Gives Birth To Elephant

పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర

    Latest News

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    • Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300

    • Kaleshwaram Project : కాళేశ్వరం విషయంలో రేవంత్ సమాలోచనలు!

    • Trump : ట్రంప్ సెక్యూరిటీ దేనికి పనికిరారా ?

    • Egg Coffee : ఎగ్ కాఫీ.. హెల్త్ కు మంచిదేనా?

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd