HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradeshs Amaravati Drone Summit 2024 On 22nd And 23rd Of October

Drone Summit : 22, 23 తేదీల్లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్‌’.. ఎందుకో తెలుసా ?

మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు.

  • Author : Pasha Date : 19-10-2024 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati Drone Summit 2024 Andhra Pradesh

Drone Summit : ఈనెల 22, 23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో ‘అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024’ జరగబోతోంది.  మంగళగిరి సీకే కన్వెన్షన్‌ వేదికగా ఈ సదస్సు జరగబోతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు (ఈనెల 22న) డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణలో డ్రోన్ల వినియోగంపై(Drone Summit) చర్చించనున్నారు. ఇందుకోసం 9 సెషన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై నాలుగు ప్రజెంటేషన్లు ఇస్తారు.  ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు జరుగుతాయి. ఈ సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది ప్రతినిధులు హాజరవుతారు.

Also Read :Agniveer : ఏపీలో అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ.. యువతకు ఉద్యోగ అవకాశం

  • ఈ సదస్సులో  ప్రముఖ డ్రోన్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందుకోసం 40 సెంటర్లు ఉంటాయి.
  • ఈనెల 22న సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద 5వేల డ్రోన్లతో భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఇందులో లేజర్ షో, ఫైర్ వర్క్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
  • డ్రోన్ వాడకం, తయారీ కేంద్రంగా ఏపీని మార్చడం ద్వారా రాబోయే ఐదేళ్లలో రూ.2వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రూ. 6,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా  పెట్టుకుంది.
  • యువతను డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్ది.. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలని ఏపీ సర్కారు భావిస్తోంది.
  • డ్రోన్లకు  రిపేర్లు చేయడంలోనూ యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ విభాగంలో వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఈ అంశాన్ని ఒక సబ్జెక్ట్‌గా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నారు.
  • డ్రోన్ ఇన్నోవేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటాను 25 శాతం మేర పెంచాలని టీడీపీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
  • పైన పేర్కొన్న లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీని రూపొందించారు. ‘అమరావతి డ్రోన్ సమ్మిట్‌ 2024’ సందర్భంగా డ్రోన్ పాలసీని విడుదల చేసి చర్చించనున్నారు.

Also Read :Dumstick Benefits : మునగ మగవారికే కాదు స్త్రీలకు కూడా ఎంతో మేలు చేస్తుందని తెలుసా..?

  • ప్రస్తుతం డ్రోన్‌ వాడకంపై దాదాపు పాతిక పరిమితులు ఉన్నాయి. వాటిని ఐదుకు పరిమితం చేయాలని ఏపీ సర్కారు యోచిస్తోంది.
  • డ్రోన్లను ఎవరైనా దుర్వినియోగం చేస్తే కఠిన శిక్షలు పడేలా రూల్స్‌ను అమలు చేయనున్నారు.
  • రూల్స్‌కు వ్యతిరేకంగా డ్రోన్లు వాడితే రూ.లక్ష ఫైన్ వేయాలని భావిస్తున్నారు.
  • 300 కిలోల నుంచి 500 కిలోల వరకు బరువున్న డ్రోన్లను వాడేలా చూడాలని యోచిస్తున్నారు.
  • డ్రోన్ల రిజిస్ట్రేషన్, లైసెన్సుల కోసం సెక్యూరిటీ క్లియరెన్సుతో సంబంధం లేకుండా అనుమతులు మంజూరు  చేయాలని భావిస్తున్నారు.
  • గ్రీన్ జోన్‌లో డ్రోన్లను వాడుకునేందుకు అనుమతులు అవసరం లేదు. రెడ్, ఎల్లో జోన్లలో డ్రోన్లను వాడాలంటే తప్పకుండా అధికారుల అనుమతి పొందాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati Drone Summit
  • andhra pradesh
  • Drone Summit
  • Drone Summit 2024

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

  • Cbn Sha

    అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

  • Amaravati

    అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd