HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Ysrcp To Launch Bus Yatra On May 26

YSRCP Bus Yatra: మే 26 నుంచి ఏపీ మంత్రుల బస్సు యాత్ర…సీఎం జగన్ దిశానిర్దేశం..!

ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) మే 26 నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘బస్సు యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

  • Author : Hashtag U Date : 20-05-2022 - 6:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ysrcp Bus Yatra
Ysrcp Bus Yatra

ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) మే 26 నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ‘బస్సు యాత్ర’ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ముఖ్యంగా బిసిలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని తెలియజేయడానికి నాలుగు రోజుల యాత్రను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక న్యాయ సందేశాన్ని కూడా ఇవ్వాలని పార్టీ యోచిస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మే 30వ తేదీతో మూడేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా సామాజిక న్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణతో సహా మంత్రుల బృందం, తమ ప్రభుత్వం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మేలుకోసం ఏం చేస్తోంది అనే అంశాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ యాత్రలో ముఖ్యంగా టీడీపీ హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, గడిచిన మూడేళ్లుగా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని కింది స్థాయి వరకూ చాటి చెప్పేలా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు బస్సు యాత్ర సందర్భంగా ఏం చేయాలో సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అమ్మ ఒడి.. విద్యాకానుక, విద్యా దీవెన పథకాలను ప్రజల్లో విస్తృతంగా చర్చించుకునేలా ప్రయత్నించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మొత్తం 17 మంది మంత్రులు, నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. వైఎస్సార్‌సీపీ నేతలు విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • bus yatra on may 26
  • ysrcp
  • YSRCP bus yatra

Related News

Janasena Mlc Naga Babu

వైఎస్ జగన్ హిందూ ద్రోహి.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు

Janasena Mlc Naga Babu  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీద జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం కడితే జగన్ కనీసం ట్వీట్ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. హిందూ మతం గురించి మాట్లాడేవారికి.. అయోధ్యలో రామమందిరం గురించి తమ స్టాండ్ ఏమిటో చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. తిరుమల డిక్లరేషన్ విషయంలోనూ జగన్‌పై నాగబాబు విమర్శలు గుప్పించారు. అబ్దుల్ కలాం కంటే జగన్ గొప్

  • Arava Sridhar Controversy

    పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !

  • Ambati Rambabu Son in Law Upesh

    చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్

Latest News

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

  • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

Trending News

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd