HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Old Building Tax

పాత భ‌వ‌నాల‌కు “రుసుం”పై మాస్ట‌ర్ ప్లాన్‌

ఏపీ ప్రజలకు మరో భారీ షాక్ జ‌గ‌న్ స‌ర్కార్ ఇవ్వ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత భ‌వ‌నాల‌పై ఏ విధంగా రుసుం వ‌సూలు చేయాలో క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

  • Author : CS Rao Date : 30-11-2021 - 4:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Old Buildings
Old Buildings

ఏపీ ప్రజలకు మరో భారీ షాక్ జ‌గ‌న్ స‌ర్కార్ ఇవ్వ‌నుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత భ‌వ‌నాల‌పై ఏ విధంగా రుసుం వ‌సూలు చేయాలో క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, ప‌ట్ట‌ణ పంచాయ‌తీల ప‌రిధిలోని భ‌వ‌నాల వైపు చూస్తోంది. ఏ విధంగా..ఎంత మొత్తంలో రుసుంను వ‌సూలు చేయవ‌చ్చునో అధికారులు అధ్య‌య‌నం చేస్తున్నారు. రాబడి కోసం కొత్త మార్గాల‌ను ప్ర‌భుత్వం అన్వేషిస్తోంది.ఆ క్ర‌మంలో 1994 నుంచి ఇప్పటివరకు ఏపీలో కట్టిన భవనాలపై రుసుం వ‌సూలు చేయ‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు స‌మాచారం. కార్పొరేషన్ల పరిధిలో ఉన్న భవనాలకు అసెస్‌మెంట్ నెంబరు ను మార్చే ప్ర‌క్రియ‌ను తొలుత తీసుకు రావాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావిస్తుంద‌ట‌. ఆ సంద‌ర్భంగా దస్తావేజులు పరిశీలించి బిల్డింగ్ ప్లాన్ ను తీసుకోవాలని వాలంటీర్లకు అదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.

Also Read : ఏపీ స‌ర్కార్ మ‌రో ప‌న్నుల బాదుడు?

ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఒక ప్లాన్ సరిపోతుందని, ఇతర భవనాల వారికి B.A ప్లాన్ నెంబర్ తేదీ అడగాలని ఆదేశాలిచ్చినట్టు వాలంటీర్ల నుంచి స‌మాచారం అందుతోంది. ఇళ్లకు BPS సంఖ్య, తేదీ కావాలనుకుంటే ప్లాన్ యొక్క చిత్రాన్ని కూడా తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఆమోదించిన ప్లాన్ లేకపోతే భారీ పెనాల్టీ, ప్లాన్ లో ఉల్లంఘనలు ఉంటే జరిమానాలు వేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.
మొత్తం మీద రాష్ట్ర ప్ర‌జ‌ల నుంచి ఏదో ఒక రూపంలో ఆదాయం రాబ‌ట్టేందుకు జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నాడు. అందుకోసం ఇప్పుడు పాత భ‌వ‌న నిర్మాణాల మీద దృష్టి ప‌డింది. ఏ విధంగా వీటి ద్వారా రుసుములు వ‌సూలు చేయనున్నారోన‌ని ఏపీ వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • old buildings tax
  • ys jagan

Related News

Vijay is following Jagan once again — Roja

Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

టీవీకే చీఫ్ విజయ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మరో పోలికను తెచ్చారు మాజీ మంత్రి రోజా. శనివారం ఆమె తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయ్.. వైఎస్ జగన్‌ను ఫాలో అవుతున్నారని రోజా అన్నారు. తమిళనాడు ఎన్నికల సమయం నుంచి జరుగుతున్న ఘ

    Latest News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

    • Venu Swamy: విజయ్-త్రిషపై వేణుస్వామి షాకింగ్ కామెంట్స్

    Trending News

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

      • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

      • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

      • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

      • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd