AP News : ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టసభలకు సంబంధించిన వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- By Kavya Krishna Published Date - 12:28 PM, Sun - 27 July 25

AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టసభలకు సంబంధించిన వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం (జూలై 26) ఈ కమిటీలను అధికారికంగా ప్రకటించారు. ప్రతి కమిటీలో 10 నుంచి 12 మంది సభ్యులను నియమించగా, సమాజంలోని వివిధ రంగాల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే దిశగా ఈ కమిటీలు పని చేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో సదుపాయాలు, వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ చర్యలు, వన్యప్రాణుల సంరక్షణ, ప్రభుత్వ సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై పర్యవేక్షణ చేస్తుంది.
సమాజంలోని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించేందుకు ప్రత్యేకంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. బీద రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ, వర్ల కుమార్ రాజా నేతృత్వంలో ఎస్సీ సంక్షేమ కమిటీ, మిర్యాల శిరీష దేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ, నజీర్ అహ్మద్ నేతృత్వంలో మైనార్టీ సంక్షేమ కమిటీ ఏర్పాటు చేశారు. అదనంగా, గౌరు చరిత అధ్యక్షతన మహిళ, శిశు, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ కూడా ఏర్పాటైంది.
Indian Spermtech :బయటపడ్డ మరో బాగోతం.. పో*ర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్న వైనం
విధానపరమైన అంశాలను సమీక్షించడానికి సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీని తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలు, పుస్తకాల ప్రోత్సాహక చర్యలను సమీక్షించేందుకు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీ ఏర్పాటు చేశారు. శాసనమండలి చైర్మన్ మోషేనురాజు నేతృత్వంలో సభా నియామాల కమిటీ, తెలుగు భాష–సంస్కృతి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని కాపాడే దిశగా ఈ కమిటీ ముఖ్యపాత్ర పోషించనుంది.
జకియా కానమ్ అధ్యక్షతన అర్జీల కమిటీ, రవీంద్రబాబు నేతృత్వంలో సభా సమక్షంలో ఉంచే పత్రాల కమిటీ, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నైతిక విలువల కమిటీను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర చట్టసభ కార్యకలాపాలలో నైతిక ప్రమాణాలను కాపాడే బాధ్యతను నిర్వహిస్తుంది.
ఇక బీటీ నాయుడు నేతృత్వంలో విశేషాధికారాల కమిటీ, ఇసాక్ బాషా అధ్యక్షతన ప్రభుత్వ హామీల కమిటీ కూడా నియమించబడ్డాయి. ఈ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, హామీలు , వాటి అమలుపై పర్యవేక్షణ చేస్తాయి. ఈ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, “ప్రతి కమిటీ ప్రత్యేక విధానాలను అమలు చేస్తూ, రాష్ట్ర ప్రజల అవసరాలు , సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమర్థవంతంగా పనిచేస్తుంది” అని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలు రాబోయే సమావేశాల్లో రాష్ట్ర ప్రగతిని సమీక్షిస్తూ, కీలక అంశాలపై నివేదికలు సమర్పించనున్నాయి.
CBN : తెలంగాణ లో కేసీఆర్ ఉన్నాడనే విషయం చంద్రబాబు మరిచిపోతున్నాడు – కేటీఆర్