AP Debts: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 4,42,442 కోట్లు : తేల్చేసిన కేంద్రం
పార్లమెంటు సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అప్పుల (Debts) చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది.
- By Balu J Published Date - 04:27 PM, Tue - 7 February 23

పార్లమెంటు సాక్షిగా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర అప్పుల (Debts) చిట్టాను కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి బయటపెట్టింది. 2019తో పోలిస్తే ఏపీ అప్పులు (Debts) దాదాపు రెండింతలు పెరిగాయని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ (TDP MP) కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ”2019లో రాష్ట్ర అప్పులు (Debts) ₹2,64,451 కోట్లు ఉండగా.. 2020లో ₹3,07,671 కోట్లు, 2021లో ₹3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తర్వాత ₹3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఏపీ అప్పు ₹4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు ₹45వేల కోట్లు అప్పులు (Debts) చేస్తోంది” అని పంకజ్ చౌదరి వెల్లడించారు.
Also Read: Babu Mohan: ‘బండి సంజయ్ ఎవడ్రా?.. వాడు నా తమ్ముడు’.. బాబుమోహన్ బూతులు!

Related News

TDP Mahanadu: రాజమండ్రిలో టీడీపీ మహానాడు
పార్టీలోకి 40 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి రానున్నారని మాట్లాడిన ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.