CM Jagan : ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఈనెల 15వ తేదీకి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేశారు.
- Author : CS Rao
Date : 12-07-2022 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఈనెల 15వ తేదీకి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేశారు. వాహన మిత్ర కార్యక్రమం కోసం విశాఖ పర్యటనకు జూలై 15వ తేదీకి వెళ్లనున్నారు.
ఆ రోజున ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో వాహన మిత్ర కార్యక్రమం ఏర్పాట్లను పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం 2022-23 లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించనున్నారు.
AP రాష్ట్ర ప్రభుత్వంచే YSR వాహన మిత్ర పథకం, ఇతర పత్రాలతో పాటు ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లను పొందేందుకు వాహనం బీమా మరియు నిర్వహణ వంటి రికరింగ్ ఖర్చుల కోసం అర్హులైన ఆటో, టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్‌లకు వార్షికంగా రూ. 10,000 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోంది.
కార్యక్రమాన్ని ముందుకు సీఎంవో షెడ్యూల్ చేసిన ప్రకారం బుధవారం జరగాలి. కానీ, వాతావరణ ప్రతికూలంగా ఉండడం, వర్షాలు కురవడం తదితర కారణాల వలన ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. షెడ్యూల్ ను సీఎంవో కార్యాలయం మళ్లీ ప్రకటించనుంది.