Andhra Pradesh: జగన్ అనే నేను.. 20 వేలు కట్టాల్సిందే
భరత్ అనే నేను సినిమాలో వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే 20 వేలు ఫైన్ వేసినట్టు ప్రస్తుతం ఏపీలో అదే రూల్ కొనసాగుతుంది. ఏపీలో వాహనదారులు హెడ్ ఫాన్స్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు కట్టాల్సిందే
- Author : Praveen Aluthuru
Date : 26-07-2023 - 1:59 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh: భరత్ అనే నేను సినిమాలో వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తే 20 వేలు ఫైన్ వేసినట్టు ప్రస్తుతం ఏపీలో అదే రూల్ కొనసాగుతుంది. ఏపీలో వాహనదారులు హెడ్ ఫాన్స్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు కట్టాల్సిందే. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రూల్ ఎవరు ఉల్లంఘించినా 20 వేలు కట్టాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వాహనం అంటే కేవలం బైక్, స్కూటీ అనుకుంటే పొరపాటే. కార్, ఆటో బైక్ ఇలా అన్ని రకాల వాహనదారులకు ఈ రూల్ వర్తిస్తుంది. ఆగస్టు 1 తేదీ నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది.
ఏపీలో రోడ్డు ప్రమాదాలను నివారించడమే ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం చెప్తుంది. ఇయర్ ఫాన్స్ పెట్టుకుని వాహనం నడిపే వారు డ్రైవింగ్ పై శ్రద్ద చూపించలేకపోతున్నారని, దీంతో వెనుక నుంచి వాహనదారులకు ఇబ్బంది ఎదురవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దీంతో ఏపీలో హెడ్ ఫాన్స్ పెట్టుకుని వాహనాన్ని నడపడాన్ని నిషేదిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టు 1 నుంచి హెడ్ ఫాన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 20 వేలు ఫైన్ కట్టాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది.
Also Read: Flight Journey For Food : కిరాణా సామాన్ల కోసం విమానంలో వెళ్తుంటుంది.. ఆమె ఎవరు ?