Chandrababu Oath Ceremony : సభ స్థలానికి చేరుకున్న అమిత్ షా , రజనీకాంత్ , చిరంజీవి
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కావడం తో సభ అంత కూడా VIP లతో కళాకలాడుతుంది
- By Sudheer Published Date - 11:14 AM, Wed - 12 June 24

మరికాసేపట్లో ఏపీకి 4 వ సారి సీఎం గా చంద్రబాబు (Chandrababu) ప్రమా స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం పరిధిలోని కేసరపల్లి (Kesarapalli ) ఐటీ పార్కు వద్ద ఉదయం 11:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కావడం తో సభ అంత కూడా VIP లతో కళాకలాడుతుంది. కొద్దీ సేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా , నడ్డా తో పాటు చిరంజీవి , రజనీకాంత్ , చిరాగ్ పాస్వాన్, వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, పన్నీర్ సెల్వం, బిజెపి అగ్రనేతలు, కిషన్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, ఈటెల రాజేందర్, బోయపాటి శ్రీను, నారా రోహిత్, నిఖిల్ ఇలా అనేక రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
సినీ , రాజకీయ ప్రముఖులు హాజరు కానుండటంతో విజయవాడ లో పోలీసులు ఆంక్షలు విధించారు. విజయవాడలోకి వాహనాలు రాకుండా అడ్డుకుంటున్నారు. కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టడంతో ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ-గన్నవరం మార్గంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలతో కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ రుసుం కోసం వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో సుమారు 2కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్‌తో ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడుతున్నారు.
Read Also : AP Cabinet : మంత్రివర్గంలో లోకేష్ మార్క్