Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు – అంబటి సెటైర్లు
Tirumala Laddu Controversy : 'ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!' అని ట్వీట్ చేశారు.
- By Sudheer Published Date - 08:06 PM, Tue - 24 September 24

తిరుమల లడ్డూ వివాదం (Tirumala Laddu Controversy)పై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ex Minister Amabati Rambabu) సెటైర్లు వేశారు. ‘ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!’ అని ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జతువుల కొవ్వు కలిసిందనే విషయం బయటకు వచ్చిన దగ్గరి నుండి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనిపై హిందూ సంఘాలే కాదు రాజకీయేతర నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ..దీనికి బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వ్యవహరించనున్నారు. అలాగే, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు దర్యాప్తు బృందంలో ఉండనున్నారు. కాగా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ SIT బాబు గారు Sit అంటే Sit, Stand అంటే Stand!’ అని ట్వీట్ చేశారు. కాగా, లడ్డూ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్రంతో సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Youtube : నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదు – మాజీ మంత్రి రోజా క్లారిటీ