Youtube : నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదు – మాజీ మంత్రి రోజా క్లారిటీ
Youtube : నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్, త్రెడ్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు
- By Sudheer Published Date - 07:14 PM, Tue - 24 September 24

RK Roja : తాను సామాజిక మాధ్యమాల్లో (Social Media) అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, థ్రెడ్స్ మాత్రమే వాడుతున్నానని, తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని మాజీ మంత్రి రోజా (Ex Minister Roja) క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు ఇష్యూ (Laddu Issue) నడుస్తుంది. హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయం తట్టుకోలేకపోతున్నారు. సామాన్య ప్రజలేనే కాదు దేవుడ్ని సైతం మోసం చేసి కల్తీ చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ..ఈ పాపానికి ఒడికట్టిన వారికీ శిక్షించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ తప్పు జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే..లేదు..లేదు మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని, వారు ప్రమాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజా (RK Roja) పేరుతో..యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై ఆమె పోల్ నిర్వహించింది. తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవరంటూ పొల్ చేపట్టగా..నెటిజన్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జగన్ దే తప్పంటూ 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎవరి పాలనలో తిరుమల బాగుందని ఆమె పోల్ పెట్టగా… చంద్రబాబు పాలనలో బాగుందని 77 శాతం మందికి పైగా ఓటు వేశారు. ఆ విధంగా వచ్చిన పోల్ ఫలితాలు రోజాకు ఝలక్ ఇచ్చాయనే అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
దీంతో తనకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదని రోజా స్పష్టం చేసింది. తన ట్విట్టర్ ఖాతాలో ఈ మేరకు ట్వీట్ చేసింది. “నేను సామాజిక మాద్యమాల్లో మీ అందరికీ అందుబాటులో ఉండటానికి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్, త్రెడ్ మాత్రమే వాడుతున్నాను. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు. నా పై ఉద్దేశ్య పూర్వకంగా జరిగిన, జరుగుతున్న దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. వెంటనే సదరు ఛానల్స్ నా పేరు పై ఉన్న అకౌంట్‌లను డెలీట్ చెయ్యాలని హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నా అధికారికంగా వెరిఫైడ్ అకౌంట్(బ్లూ టిక్ ఉన్న)లను మాత్రమే ఫాలో కాగలరని అభిమానులను కోరుకుంటున్నాను.” అని మాజీ మంత్రి రోజా రాసుకొచ్చారు. మరి నిజంగా ఆ యూట్యూబ్ ఛానల్ ఆమెది కదా..? లేక నెటిజన్ల షాక్ తో తనకు ఛానల్ లేదని చెపుతుందా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : SPB Death Anniversary: ఆ పాటకు మరణం లేదు, శంకరాభరణంతో అంతర్జాతీయ గుర్తింపు