AP : అంబటి రాంబాబు ‘పేపర్ టీ కప్పు’లను కూడా వదలడం లేదు..
టీ షాప్స్ లలో జనాలు ఎక్కువ సేపు ఉండడం తెలుసుకున్న అంబటి..పేపర్ టీ కప్పు లపై తన ఫోటోలను ముద్రించి తనకు ఓటు వేయాలని కోరుతూ అన్ని టీ షాప్స్ లలో పంచాడు
- Author : Sudheer
Date : 17-04-2024 - 1:24 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ(AP)లో రాజకీయ పార్టీల ప్రచారం (Election Campaign) మాములుగా లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు (YCP Leaders) డబ్బులు నీరులా ఖర్చుచేస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియా , పలు మీడియా సంస్థల్లోనే కాక తమ నియోకజవర్గంలో ఊరు, వాడ , పల్లె , పట్టణం , ఇలా ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు , హోర్డింగ్స్ , ప్లెక్సీ లు అంటిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఇక సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu ) అయితే ఆఖరికి తాగే పడేసే ‘పేపర్ టీ కప్పు’లను కూడా వదిలిపెట్టకుండా తనకు ఓటు వేయాలని కోరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
దీనికి సంబదించిన వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. తనకు టికెట్ ఖరారు కానప్పటి నుండే అంబటి రాంబాబు తన ప్రచారాన్ని మొదలుపెట్టాడు. సత్తెనపల్లిలో ఆ మధ్య బుల్లెట్‌పై తిరుగుతూ ప్రజలను పలకరించాడు. ఆ తర్వాత టీ షాప్ కు వెళ్లి కస్టమర్లకు టీ చేసి ఇచ్చారు. ఆ తర్వాత దోస బండి దగ్గరికి వెళ్లి స్వయంగా దోసెలు వేసి ఆకట్టుకున్నాడు. ఇలా అన్ని చోట్లకు వెళ్లి ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు..ఎంత సేపు ఉంటున్నారు అనేది తెలుసుకొని తనదైన శైలి లో ప్రచారం మొదలుపెట్టాడు. ఎక్కువగా టీ షాప్స్ లలో జనాలు ఎక్కువ సేపు ఉండడం తెలుసుకున్న అంబటి..పేపర్ టీ కప్పు లపై తన ఫోటోలను ముద్రించి తనకు ఓటు వేయాలని కోరుతూ అన్ని టీ షాప్స్ లలో పంచాడు. సదరు టీ షాప్ యాజమాన్యం సైతం ఫ్రీ గా వస్తే మాకు రెండు రూపాయిలు మిగులుతాయి కదా అని వాటిని తీసుకొని , అందులో టీ పోసి అమ్ముకుంటున్నారు.
ఈ వీడియోలు చూసి మిగతా నేతలు కూడా అంబటి ని ఫాలో అవ్వాలని చూస్తున్నారట. ఏది ఏమైనప్పటికి వైసీపీ పార్టీ నేతలు ముందు నుండి పబ్లిసిటీ ని గట్టిగా నమ్ముకున్నారు. చేసేది గోరంత..చెప్పుకునేది కొండంత అనేది అందరికి తెలిసిందే..ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా అదే చేస్తున్నారు.
Read Also : X Posts Vs EC : ఈసీ ఆర్డర్.. టీడీపీ, వైఎస్సార్ సీపీల ‘ఎక్స్’ పోస్టులు డిలీట్