Amaravati Relaunch : జగన్ కు ఆహ్వానం అందింది..మరి వస్తారా..?
Amaravati Relaunch : ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం
- By Sudheer Published Date - 10:44 AM, Thu - 1 May 25

ఏపీ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల రీ-లాంచ్ (Amaravati Relaunch) కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మే 2న హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(Jagan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం (Invitation)పంపించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రోటోకాల్ అధికారి స్వయంగా తాడేపల్లి వెళ్లి ఆహ్వాన పత్రికను జగన్ కార్యదర్శికి అందజేశారు.
BJP Big Plan: గోదావరి జిల్లాలపై బీజేపీ గురి.. ఇద్దరు ఎంపీలతో బిగ్ స్కెచ్
జగన్ హాజరవుతారా లేదా అన్నది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేపుతోంది. గతంలో మూడు రాజధానుల నిర్ణయంతో వ్యతిరేకతను ఎదుర్కొన్న జగన్, అమరావతిని ఒక్కటే రాజధానిగా ప్రకటించిన ప్రస్తుత ఎన్డీయే కూటమికి ఎన్నికల్లో ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని పాల్గొంటున్న ఈ సభకు జగన్ హాజరైతే, గత వైఖరి నుంచి ఆయన మారుతున్నారనే సంకేతంగా భావించవచ్చు. పార్టీ లోపల కూడా నాయకులు జగన్‌ను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న సూచనలు ఇస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ అంశంపై జగన్ తన పార్టీలో కీలక నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే అమరావతి టెండర్ల పై విమర్శలు చేసిన ఆయన, రాజధాని నిర్మాణంపై అనేక వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు మారడంతో జగన్ హాజరు అయితే అది సానుకూల సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తాను స్వయంగా హాజరవుతారో, లేక పార్టీ తరఫున ప్రతినిధిని పంపిస్తారో అన్న విషయం మీద స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తేవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.