CM Chandrababu : పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలి.. డిజిటల్ కరెన్సీతో అవినీతి అంతం : చంద్రబాబు
డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే, రాజకీయ పార్టీలకు డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 02:45 PM, Tue - 27 May 25

CM Chandrababu : మన దేశంలోని కరెన్సీ నోట్ల వ్యవస్థపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో అవినీతిని తగ్గించొచ్చని, డిజిటల్ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరమే ఉండదన్నారు. ఈరోజు (మంగళవారం) కడపలో టీడీపీ మహానాడు ప్రతినిధుల సభలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Suryakumar Yadav : సూపర్ సూర్యకుమార్.. రెండుసార్లు 600 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డ్
రూ. 500 నోట్లను రద్దు చేయాలి : చంద్రబాబు
రూ. 500 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. డిజిటల్ కరెన్సీ వాడకం పెరిగిన నేపథ్యంలో అన్ని పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్ చేపట్టిన సమయంలో డిజిటల్ కరెన్సీపై ప్రధాని మోడీకి తాను ఒక రిపోర్ట్ ఇచ్చానని చంద్రబాబు చెప్పారు. ఆ రిపోర్టులో రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేయాలని సూచించానని ఆయన గుర్తుచేశారు. కొత్తగా తెచ్చిన రూ. 2 వేల నోట్లను కూడా రద్దు చేయాలని ఆనాడే సూచించానని తెలిపారు.
రాజకీయ పార్టీలకు డొనేషన్ ఫోన్ ద్వారా ఇవ్వొచ్చు
డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి వస్తే, రాజకీయ పార్టీలకు డొనేషన్ కూడా ఫోన్ ద్వారా ఇవ్వొచ్చని చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు. రాజకీయాల్లో డబ్బులు పంచే అవసరం కూడా ఉండదన్నారు. పెద్ద నోట్ల రద్దు విషయంలో అందరూ తనతో ఏకీభవించాలని ఆయన కోరారు. అన్ని పెద్ద నోట్లు రద్దు చేయాలనే తన డిమాండ్‌కు చప్పట్లు కొట్టి ఆమోదం తెలపాలన్నారు.పెద్దనోట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టాలని చంద్రబాబు కోరారు. ఏపీలో అవినీతిని అరికట్టేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చామని, ప్రస్తుతం ఒక వాట్సాప్ మెసేజ్‌తో పని జరుగుతోందని ఆయన చెప్పారు. అధికారులు కూడా పారదర్శకంగా నివేదిక ఇస్తున్నారని తెలిపారు. డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో పెద్ద విలువ కలిగిన నోట్ల అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రసంగంలో ఈ పెద్దనోట్ల రద్దు అంశమే హైలైట్ అయింది. ఇంతకీ చంద్రబాబు సూచనల ప్రకారం ప్రధాని మోడీజీ సంచలన నిర్ణయం తీసుకుంటారా ? అనేది వేచి చూడాలి.