Tirumala: టీటీడీ భక్తులకు అలర్ట్.. నడక మార్గంలో మరో 3 చిరుతలు!
మీరు తిరుమలకు వెళ్తున్నారా.. అయితే జర జాగ్రత్త వహించాల్సిందే. మెట్ల మార్గంలో 3 చిరుతలు ఉన్నాయట.
- By Balu J Published Date - 11:27 AM, Mon - 14 August 23

టీటీడీ భక్తులకు అలర్ట్ ఒక చిరుత కాదు, నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయి. తిరుమల నడకదారిలో చిన్నారిని చంపిన చిరుతను అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. నడకదారి సమీపంలో మరో 3 చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించామని, భక్తుల భద్రత దృష్ట్యా వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం జరిగే టీటీటీ హైలెవల్ మీటింగులో కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
తిరుమల కాలి నడక మార్గంలో రెండు రోజుల క్రితం ఓ చిన్నారి ప్రాణం తీసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. ఆ చిరుత ఆదివారం అర్ధరాత్రి బోనులో చిక్కిందని తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) అటవీ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు చిరుతను బంధించారు. అధికారులు అంచనా వేసినట్టుగానే.. చిన్నారి ప్రాణం తీసిన ప్రాంతానికే చిరుత ఆదివారం అర్ధరాత్రి మళ్లీ వచ్చి అక్కడ అమర్చిన ఒక బోనులో చిక్కింది. చిరుత చిక్కడంతో (Tirumala Cheetah Trapped) టీటీడీ అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: TSRTC: టీఎస్ఆర్టీసీ పంద్రాగస్ట్ ఆఫర్, హైదరాబాద్ లో రూ.75 కే టి-24 టికెట్