HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tsrtc Aug 15 Offer Rs 75k T 24 Ticket In Hyderabad

TSRTC: టీఎస్ఆర్టీసీ పంద్రాగస్ట్ ఆఫర్, హైదరాబాద్ లో రూ.75 కే టి-24 టికెట్

ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది.

  • Author : Balu J Date : 14-08-2023 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSRTC
TSRTC

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్ లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్ ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు టి-24 టికెట్ ను రూ.50కే అందజేయనుంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రమే ఒక్క రోజు ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటీజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్ ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50 కి ఇస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటీజన్లకు ఒక్క రోజు టికెట్ లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది. “ఆగస్టు 15 భారతీయులందరికీ పండుగ రోజు. మన దేశ చరిత్రలో అదొక మైలురాయి. వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఆ శుభ దినాన ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లే సీనియర్ సిటీజన్లకు టికెట్ లో 50 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది.

60 ఏళ్లు దాటిన స్త్రీ, పురుష సీనియర్ సిటీజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. వారు ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్ కి తమ ఆధార్ కార్డును చూపించాలి. అలాగే, స్వాతంత్ర్య దినోత్సవం నాడు హైదరాబాద్ సిటీలో ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆ రోజున పర్యాటక ప్రాంతాలు, పార్కులకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టి-24 టికెట్ పై భారీ రాయితీని సంస్థ ప్రకటించింది. ఆ టికెట్ ను పెద్దలకు రూ.75కి, పిల్లలకు రూ.50కి అందజేస్తోంది. ఈ నెల 15న ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయి. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • RTC Buses
  • Sajjanar
  • tsrtc

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

    • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

    • Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు

    • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

    • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd