HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Affected Families Will Get Rs 25 Lakhs As Ex Gratia Minister

Ex Gratia: బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా: మంత్రి

తొక్కిస‌లాటకు అధికారుల స‌మ‌న్వ‌య‌లోపమే కార‌ణ‌మని తెలుస్తోంది. అలాగే ఇందులో పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉన్న‌ట్లు మంత్రులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

  • Author : Gopi Date : 09-01-2025 - 11:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ex Gratia
Ex Gratia

Ex Gratia: తిరుప‌తిలోని వైకుంఠ ద్వార ద‌ర్శ‌న‌ టిక్కెట్ల కేంద్రాల వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు శ్రీవారి భ‌క్తులు మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా (Ex Gratia) ప్ర‌క‌టిస్తున్న‌ట్లు మంత్రి అనిగాని సత్యప్రసాద్ గురువారం ఉద‌యం పేర్కొన్నారు. అలాగే ఈ ఘ‌ట‌న‌పై దేవ‌దాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

రుయా ఆస్ప‌త్రి వ‌ద్ద మంత్రి ఆనం మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ఘటనకు తొందరపాటు చర్య లేదా సమన్వయా లోపమా అనేది విచారణలో వెళ్లడవుతుంది. బాధిత‌ కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం. మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపుతాం. అంత్యక్రియలకు సహకారం అందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామ‌ని ఆయ‌న అన్నారు.

Also Read: Tirupati Stampede Incident : మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు

మంత్రి అనిత మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ప్రాణాలను కాపాడబోయిన సమయంలో జరిగిన సంఘటన ఇది. మొత్తం ఆరు మంది మరణించారు. ఇందులో అధికంగా విశాఖ జిల్లా వాసులు ఉన్నారు. ఎవరి వైఫల్యం అనే విషయం సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంది. ఇది ప్రమాదమా? కుట్ర కోణామా అనే విషయం కూడా విచారణలో వెల్లడవుతుంది. ఈ ఘటనపై ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రికి అధికారులు ఇవ్వనున్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తాం. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో సహకరించాలి. అర్థం చేసుకోవాలి. ఇది దురదృష్టకర సంఘటన అని మంత్రి అనిత తెలిపారు.

ఎవ‌రూ కార‌ణం?

తొక్కిస‌లాటకు అధికారుల స‌మ‌న్వ‌య‌లోపమే కార‌ణ‌మని తెలుస్తోంది. అలాగే ఇందులో పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉన్న‌ట్లు మంత్రులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. టికెట్ కౌంట‌ర్‌లో ప‌నిచేసే ఒక సిబ్బంది అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో అత‌న్ని బ‌య‌ట‌కు తీసుకెళ్లేందుకు స్థానిక పోలీస్ గేట్ ఓపెన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే టికెట్ల కోసం గేట్లు ఓపెన్ చేశార‌ని భ‌క్తులు భావించ‌డంతో ఈ తోపులాట జ‌రిగింద‌ని ప్రాథ‌మిక స‌మాచారం. ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో మొత్తం ఆరుగురు క‌న్నుమూశారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ex-gratia
  • Stampede
  • telugu news
  • Tirupati
  • Tirupati News
  • tirupati stampede
  • Vaikunta Dwara Sarva Darshan

Related News

Actress Shweta Menon resigns as 'AMMA' President.

Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’ (Association of Malayalam Movie Artists – AMMA) లో ఊహించని రాజకీయ సునామీ చెలరేగింది. అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపుల ఆరోపణలు, ఆర్థిక వివాదాలు ముదరడంతో.. ‘అమ్మ’ ప్రెసిడెంట్, స్టార్ హీరోయిన్ శ్వేతా మేనన్‌తో పాటు మెజారిటీ కార్యవర్గ సభ్యులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. శ్వేతా మేనన్ ఏకంగా అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించడ

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • 'Towing' food app launched in Vijayawada.

    Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd