HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ministers Visited The Families Of The Deceased

Tirupati Stampede Incident : మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రులు

Tirupati Stampede Incident : రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు

  • Author : Sudheer Date : 09-01-2025 - 11:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ministers Visited The Famil
Ministers Visited The Famil

తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede)లో మరణించిన వారి కుటుంబాలను మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పరామర్శించారు. రుయా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఘటనపై ఆరాతీశారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా మరికాసేపట్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శిస్తారు.

తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక

తిరుపతి టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అధికారుల నుంచి సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు నివేదిక అందింది. ఈ నివేదిక(Report)లో ఘటనకు సంబంధించిన వివరాలను, కారకాలను స్పష్టంగా చర్చించారు. ముఖ్యంగా పోలీసు అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని నివేదికలో ప్రస్తావించారు. ఘటన సమయంలో డీఎస్పీ అత్యుత్సాహంగా వ్యవహరించి, ఒక్కసారిగా భక్తులను కౌంటర్ వద్దకు రప్పించారని నివేదిక పేర్కొంది. అంత పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి చేరడం వల్ల తొక్కిసలాట ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి ఘర్షణాత్మకంగా మారినప్పటికీ, డీఎస్పీ సకాలంలో స్పందించలేదని నివేదికలో పేర్కొన్నారు.

అలాగే అంబులెన్స్ డ్రైవర్ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. టికెట్ కౌంటర్ బయట అంబులెన్స్‌ను పార్క్ చేసి డ్రైవర్ అక్కడినుంచి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. తొక్కిసలాట జరిగిన తర్వాత 20 నిమిషాల పాటు అతను అందుబాటులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. ఇక నివేదికలో వెల్లడైన వివరాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కర్నూలు జిల్లా పవన్, లోకేశ్ పర్యటనలు రద్దు

తిరుమల తొక్కిసలాట ఘటన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కర్నూలు జిల్లా పర్యటన రద్దు చేసుకున్నారు. గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టును పవన్ పరిశీలించాల్సి ఉంది. అలాగే అనివార్య కారణాల వల్ల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) కర్నూలు పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు తెలిపారు. లోకేశ్ ఈరోజు కర్నూలులో పలు కళాశాలల సందర్శనతోపాటు మంత్రి భరత్ కుమార్తె రిసెప్షన్ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. కాకపోతే తిరుపతి ఘటన నేపథ్యంలో తన పర్యటన ను రద్దు చేసుకున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Ministers visited the families of the deceased
  • Tirupati stampede incident

Related News

Ap Sanjeevani Scheme

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd