TDP : టీడీపీలో చేరిన నటుడు బాబు మోహన్
TDP : బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు.
- By Latha Suma Published Date - 03:26 PM, Tue - 29 October 24

Actor Babu Mohan : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అక్టోబరు 26న సీఎం చంద్రబాబు ప్రారంభించిన విషం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటుడు, తెలంగాణ రాజకీయనేత బాబూమోహన్ కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఆన్ లైన్ లో టీడీపీ సభ్యత్వ నమోదు చేయించుకున్న బాబూమోహన్, తన మెంబర్ షిప్ వివరాలను ట్యాబ్ లో చూపిస్తున్న ఫొటోను టీడీపీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకుంది. గతంలో బాబు మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలోని తాజాగా పరిస్థితుల్లో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇకపోతే.. బాబు మోహన్ తొలిసారిగా 1998 ఉపఎన్నికలో ఆందోల్ టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. అనంతరం 1999లోనూ విజయం సాధించి మంత్రి అయ్యారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందారు. 2018లో బీఆర్‌ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. గత ఏడాది బీజేపీ కి కూడా రాజీనామా చేశారు.. ఆ ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ తరుపున పోటీ చేయాలని భావించి ఆ పార్టీలో చేరారు.. అయితే ఒక్క రోజులోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మళ్లీ స్వంత గూడు టిడిపిలోకి చేరారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీలో పార్టీ అధికారంలోకి రావడంతో అధినేత చంద్రబాబు తెలంగాణపైనా ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణలోనూ పార్టీకి ఒకప్పటి వైభవం తీసుకురావాలని అనుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ నేతలతో ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు కూడా. ఇందులో భాగంగానే వారానికి రెండు రోజులు తెలంగాణకు సైతం వచ్చి పార్టీ కార్యక్రమాలపై చర్చించేందుకు నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాగా.. తెలంగాణలో ఓ కీలక నేత టీడీపీ సభ్యత్వం పొందడం చర్చకు దారితీసింది.
Read Also: Chintalapudi Lift Irrigation Project: రెండు ఫేజ్ లలో చింతలపూడి ఎత్తిపోతల పథకం!