HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Young Man Trapped A Married Woman Called Her To His Room Oh My God

వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !

  • Author : Vamsi Chowdary Korata Date : 07-02-2026 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Illegal Affair
Illegal Affair

Illegal Affair  విజయవాడలో ఓ వివాహితను యువకుడు ట్రాప్ చేశాడు. ఆమెను భర్త నుంచి దూరం చేసి వేధింపులు మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు.. మొదట ఆమె ఒప్పుకోలేదు. ఆమెకు మాయ మాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్ నుంచి విజయవాడ రప్పించాడు. అక్కడ ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతుందని తెలుసుకుని గొడవకు దిగాడు. ఆ కోపంలో యువతి నోట్లో పురుగుల మందు పోశాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ యువతికి 10 నెలల క్రితం వివాహమైంది.. ఇంతలో ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. భర్తకు మాయ మాటలు చెప్పడంతో అతడు ఆ యువతిని వదిలేశాడు. భర్త నుంచి విడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ముంచాడు. ఆమె వేరే యువకుడితో మాట్లాడుతుందనే కోపంతో ఆమె నోట్లో పురుగుల మందు పోశాడు. ఆస్పత్రిలో చేరిన యువతి కోలుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రాంతానికి చెందిన యువతికి గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. భర్తతో జీవతం సాఫీగా సాగిపోతున్న సమయంలో.. భవానీ శంకర్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. అక్కడితో ఆగకుండా ఆమెను భర్త నుంచి విడగొట్టాలని ప్లాన్ చేశాడు. నేరుగా ఆమె భర్తక ఫోన్ చేసి అబద్ధాలు చెప్పాడు.. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి యువతి తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసింది. వెంటనే ఆమె విజయవడలో నర్సింగ్ కోర్సులు చేరాలని నిర్ణయం తీసుకుంది.. ట్రైనింగ్ కూడా తీసుకుంటోంది. అయితే భవానీ శంకర్ మళ్లీ ఆమె వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుంటానంటూ వేధించాడు. ఆ యువతి భవానీ శంకర్ వేధింపులు భరించలే.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

యువతి తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌‌ తీసుకెళ్లి ఓ హాస్టల్‌లో చేర్చారు.. అక్కడే ఉండి ఆమె చదువుకుంటున్నారు. కొంతకాలం భవానీ శంకర్‌కు ఆమె వివరాలు తెలియలేదు. ఇంతలో యువతి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ గురించి అతడికి తెలిసింది. మెల్లిగా ఆమె మొబైల్ నంబర్ తెలుసుకుని కాల్ చేసి మళ్లీ వేధించాడు. అయితే పెళ్లి చేసుకుంటానని పదే, పదే చెప్పడంతో ఆమె కూడా నిజమని నమ్మింది. ఈ నెల 2న భవానీ శంకర్ పిలవడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చింది.. ఆమెను దేవీనగర్‌లోని రూమ్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ మరుసటి రోజు యువతి మొబైల్‌ను భవానీ శంకర్ చెక్ చేశాడు.

యువతి మొబైల్‌‌లో ఓ యువకుడి ఫోన్ నంబర్ ఉండటాన్ని భవానీ శంకర్ గమనించాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న భవానీ శంకర్ గొడవకు దిగాడు.. ఆమెపై చేయి చేసుకున్నాడు. యువతి భవానీ శంకర్‌ గది నుంచి బయటకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్దామని భావించింది. ఆమె రైల్వే స్టేషన్‌కు వెళ్లగా.. భవానీ శంకర్ కూడా వెనకే వెళ్లాడు. మళ్లీ యువతకి నచ్చజెప్పి గదికి తీసుకొచ్చాడు.. ఇద్దరు మరోసారి గొడవపడ్డారు. ఆ తర్వాత కోపంతో భవానీ శంకర్ యువతి నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు. యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చి తల్లికి సమాచారం ఇచ్చాడు. భవానీ శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువతి కోలుకున్న తర్వాత విజయవాడ అజిత్‌సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. భవానీ శంకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • illegal affair
  • love story
  • Married woman
  • vijayawada
  • Young Man Cheated

Related News

Kesineni Nani

Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

విజ‌య‌వాడ‌లోని కృష్ణ‌లంక యువ‌కుడు గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. ఈ కేసులో వస్తున్న అక్రమ నిర్బంధం, కస్టడీ మరణం, సాక్ష్యాల ధ్వంసం ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరిపించాలని మాజీ ఎంపీ కేశినేని నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయ‌న‌ లేఖ రాశారు. “మంచి ప్రభుత్వం అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికైనా

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd