HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Train Dragged Railway Electric Wires At Andhra Pradeshs Visakhapatnam Railway Station

Train Dragged Wires : విశాఖ రైల్వేస్టేషన్‌లో షాకింగ్ ఘటన.. విద్యుత్‌ తీగలను ఈడ్చుకెళ్లిన ఇంజిన్

విద్యుత్ తీగలను(Train Dragged Wires) సరిచేసే పనులు పూర్తయిన వెంటనే ఆ లైను రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు.

  • By Pasha Published Date - 08:14 AM, Sun - 22 December 24
  • daily-hunt
Train Dragged Wires Visakhapatnam Railway Station Ap

Train Dragged Wires : రైల్వే ట్రాక్‌లపై ఉండే విద్యుత్ తీగలలో నిత్యం హైఓల్టేజీ కలిగిన విద్యుత్ ప్రసారం జరుగుతుంటుంది.  అంతటి ప్రమాదకరమైన రైల్వే విద్యుత్ తీగలను ఓ రైలు ఇంజిన్‌ కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. వెంటనే అప్రమ్తతమైన రైల్వే సిబ్బంది వాటికి విద్యుత్‌ సరఫరాను ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఉండే విద్యుత్ తీగలు కొన్ని సడలడంతో ఆ లైను మీదుగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలను(Train Dragged Wires) సరిచేసే పనులు పూర్తయిన వెంటనే ఆ లైను రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు.

Also Read :Allu Arjun Attitude: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాటిట్యూడ్‌.. టాలీవుడ్‌కు న‌ష్ట‌మే!

ఎలా జరిగింది ?

తమిళనాడులోని తిరునల్వేలి నుంచి పశ్చిమ్‌బెంగాల్‌లోని పురూలియాకు వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22606) ఇవాళ తెల్లవారుజామునే విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఆ రైలుకు ఇంజిన్‌ను విశాఖపట్నంలో మార్పు చేశారు.  మరో ఇంజిన్‌ను రైలుకు బిగించారు.  ఆ ఎక్స్‌ప్రెస్ నుంచి తొలగించిన రైలు ఇంజిన్‌.. రైల్వే ట్రాక్‌పై ఉండే విద్యుత్‌ తీగలను కొంతదూరం లాక్కెళ్లింది. విశాఖపట్నం రైల్వే స్టేషను సిబ్బంది చొరవతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరాను వెంటనే ఆపడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Also Read :Allu Arjun Jail Again: అల్లు అర్జున్‌ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా? పోలీసులు ఏం చేయ‌బోతున్నారు!

పలు రైళ్ల దారి మళ్లింపు 

  • కాజీపేట, విజయవాడ సెక్షన్ల మధ్య మోటుమారి జంక్షన్‌లో మూడో లైన్‌ను ప్రారంభించడం, ప్రీ నాన్-ఇంటర్‌ లాకింగ్ పనులు, నాన్-ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా ఎనిమిది రైళ్లు దారి మళ్లించారు.
  • ఈ రైళ్లు గుంటూరు-పగిడిపల్లి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తాయి.
  • విశాఖపట్నం- లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ రైలు(18519)  డిసెంబ‌ర్ 26 నుంచి జ‌న‌వ‌రి 8 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది. కాజీపేటలో స్టాపేజ్ తొలగించారు.
  • విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(20833)  జ‌న‌వ‌రి 8, జ‌న‌వ‌రి 9 తేదీలలో మళ్లించిన మార్గంలో నడుస్తుంది. స్టాపేజ్‌లు ఖమ్మం టౌన్, వరంగల్‌ను తొలగించారు.
  • హైదరాబాద్- షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(18046) జ‌న‌వ‌రి 7 నుంచి జ‌వ‌న‌రి 9 వ‌ర‌కు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. భోంగీర్, ఆలేరు, జనగాన్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం టౌన్ వంటి స్టాప్‌లు తొలగించారు.
  • సికింద్రాబాద్- షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు(12774)  జ‌న‌వ‌రి 7న‌ దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది. వరంగల్, రాయనపాడులో స్టాపేజ్‌లు తొలగించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Railway Electric Wires
  • Train Dragged Wires
  • Visakhapatnam
  • Visakhapatnam Railway Station

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd