Student Attempted Suicide: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది.
- By Gopichand Published Date - 11:49 AM, Wed - 17 July 24

Student Attempted Suicide: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం (Student Attempted Suicide) చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించి ఆమె తోటి విద్యార్థులు హుటహుటిన అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు మౌనికకు చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.
కడప జిల్లా పులివెందులకు చెందిన మౌనిక అనే విద్యార్థిని అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. యూనివర్సిటీలో ఎంబీఏ సెకండియర్ చదువుతు యమునా హాస్టల్లో ఉంటుంది. అయితే బుధవారం ఉదయం తోటి విద్యార్థులు హాస్టల్ లో టిఫిన్ చేయడానికి వెళ్లిన సమయంలో బాధిత విద్యార్థిని మౌనిక గదిలోని ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులు ఎంత పిలిచిన తలుపు తీయకపోవడంతో తలుపులను పగలగొట్టారు ఫ్యాన్ కు వేలాడుతున్న మౌనికను కింద దించి యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ కు తీసుకువెళ్లారు.
Also Read: Filmfare Awards South 2024 : ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేషన్స్‌లో ఉన్న తెలుగు సినిమాలివే..
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారం రోజుల క్రితం తోటి విద్యార్థులతో కలిసి మౌనిక విహారయాత్రకు వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇవాళ మౌనిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం యూనివర్సిటీలో కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా లేక మరి ఏదైనా కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.