HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Key Step Towards Cancer Prevention Ap Gets Modern Radiation Equipment Worth Rs 48 Crores

Cancer Prevention: క్యాన్సర్ నిరోధానికి ముందడుగు.. ఏపీకి రూ. 48 కోట్ల విలువైన రేడియేషన్ పరికరాలు!

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరిగింది.

  • Author : Gopichand Date : 23-07-2025 - 2:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cancer Prevention
Cancer Prevention

Cancer Prevention: క్యాన్సర్ వ్యాధి నివారణ, చికిత్సలో (Cancer Prevention) ఆంధ్రప్రదేశ్‌కు ఒక కీలక ముందడుగు పడింది. కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఈరోజు (జూలై 23) న్యూఢిల్లీలో కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు.

రూ. 48 కోట్ల విరాళం

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో సహకారంగా ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) నుండి కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా మూడు రేడియేషన్ మిషన్లను సమకూర్చే అంశంపై చర్చ జరిగింది. దీనికి ONGC అంగీకరించింది. ఒక్కొక్కటి సుమారు రూ. 16 కోట్లు విలువ చేసే ఈ పరికరాలు మొత్తం రూ. 48 కోట్లు విలువ చేస్తాయి.

Also Read: Vice-Presidential Election: ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన ఈసీ!

ఎక్కడ ఏర్పాటు చేస్తారు?

ఈ అత్యాధునిక రేడియేషన్ యంత్రాలను త్వరలో కాకినాడ‌, గుంటూరు, క‌డ‌ప జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ పరికరాలు క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంలో అలాగే రేడియేషన్ చికిత్స అందించడంలో కీలకంగా పనిచేస్తాయి.

సానా సతీష్ బాబు కృతజ్ఞతలు

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ.. “ఇది కేవలం సాంకేతిక సహాయం కాదు… ప్రజల ప్రాణాల కోసం నిలిచే ఆశ. క్యాన్సర్‌పై పోరాటానికి కేంద్ర మంత్రుల సహకారం మాకు బలాన్ని ఇస్తోంది. ONGC యాజమాన్యానికి, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ల‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలిపారు. ఈ చొరవ ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Cancer Prevention
  • guntur
  • Kadapa
  • kakinada
  • Radiation Equipment

Related News

Special Trains For Sankranti 2026

సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

Special Trains For Sankranti 2026 సంక్రాంతి పండుగ సందడితో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి రద్దీ పెరిగింది. విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఛైర్ కార్, జనరల్ బోగీలతో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్

  • Songa Roshan Kumar

    గ్రీన్‌ఫీల్డ్ హైవేపై టీడీపీ ఎమ్మెల్యే డ్యాన్స్

  • Ap Sports Infrastructure And Construct Indoor Hall

    ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..

  • Magnum Wings Air Taxi

    వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

  • Kakinda Kuda

    కుడా చైర్మన్ పదవిపై ఉత్కంఠ : మంత్రి పేరు వాడుకుంటూ తలాటం సత్య చక్రం?

Latest News

  • రాత్రి నెయ్యితో పాలు తాగితే ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..!

  • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన పోటీ

  • ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా..ఎయిర్‌టెల్ ఆకర్షణీయమైన ఆఫర్‌

  • తారిఖ్‌ రహ్మాన్‌ చేతికి బీఎన్‌పీ పగ్గాలు

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..?: పరిష్కారాలు ఇవే..!

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd