AP & TG : హై అలెర్ట్ జోన్ గా ఆ 14 ప్రాంతాలు
AP & TG : ప్రజలు గుమికూడకుండా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం స్పష్టమైన సూచనలు చేసింది.
- By Sudheer Published Date - 02:58 PM, Sat - 26 April 25

పహాల్గాం ఘటన (Pahalgam Attack ) నేపథ్యంలో కేంద్ర హోంశాఖ (Central Home Ministry) తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 14 కీలక ప్రాంతాలను హై అలెర్ట్ జోన్‌లు (14 areas declared as high alert zones)గా గుర్తించింది. ఈ ప్రాంతాల్లో భద్రతను పెంచి, అక్టోపస్ బలగాలను మోహరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలు గుమికూడకుండా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం స్పష్టమైన సూచనలు చేసింది.
Blood Donation: వామ్మో తరచుగా రక్తదానం చేయడం వల్ల ఇన్ని లాభాలు కలుగుతాయా!
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, కూకట్‌పల్లి, నాంపల్లి, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో అలిపిరి వద్ద కూడా నిఘా పెంచగా, విశాఖపట్నంలో రైల్వే స్టేషన్, ఆర్కే బీచ్, జగదాంబ జంక్షన్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత బలపరిచారు. విజయవాడలో రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, మహాత్మాగాంధీ రోడ్డు వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో నిరంతర నిఘాతో పాటు, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలతో నిఘా పెంచారు. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయంతో పనిచేయాలని, ప్రజల భద్రతకు ఎలాంటి రాజీపడకూడదని స్పష్టం చేసింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యధిక అప్రమత్తత వాతావరణం నెలకొంది.