Morocco Earthquake: మొరాకో భూకంప బాధితులకు విరాళం అందించాలని స్మిత్
మొరాకోలో సంభవించిన భారీ భూకంపానికి దేశం అతలాకుతలం అయింది. ఉహించనివిధంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 15-09-2023 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
Morocco Earthquake: మొరాకోలో సంభవించిన భారీ భూకంపానికి దేశం అతలాకుతలం అయింది. ఉహించని విధంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. దీంతో ఆ దేశం సాయం కోసం ఎదురుచూస్తుంది. మెడికల్, ఆహారం, నివాసం వంటి సదుపాయాల కోసం బాధితులు ఎదురుచూపులు చూస్తున్న పరిస్థితి. భారీ విపత్తుతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయసహకారాలు అందిస్తూనే ఉంది . అయినప్పటికీ అందరికీ సాయం అందుతున్నట్టు కనిపించడం లేదు. ఈ మేరకు పలు దేశాలు మొరాకో ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి.
హాలీవుడ్ నటుడు, గాయకుడు విల్ స్మిత్ స్పందించాడు. సెప్టెంబర్ 8 శుక్రవారం నాడు మొరాకోలో సంభవించిన వినాశకరమైన భూకంపం వల్ల నష్టపోయిన వారికి విరాళాలు అందించాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో భూకంపం వల్ల ప్రభావితమైన ప్రాంతాలను ఆదుకునేందుకు ఆహారం మరియు ఆర్థిక మరియు వైద్య సహాయం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా భూకంపం వల్ల ప్రభావితమైన మారుమూల ప్రాంతంలో సహాయం అవసరమని అన్నాడు. కాగా భూకంపం మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు స్మిత్. 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం ఉత్తర ఆఫ్రికా దేశంలో విషాదకరంగా సుమారు 3,000 మంది ప్రాణాలను బలిగొంది మరియు 5,000 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Petition in Supreme Court: ఉదయనిధి స్టాలిన్, డీఎంకే ఎంపీ రాజాపై సుప్రీంకోర్టులో పిటిషన్..!