HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >War Effect On India

యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?

ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి

  • Author : Sudheer Date : 03-03-2026 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
War Effect On India
War Effect On India

War Effect On India : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండుతుండటంతో, దేశీయంగా ఇంధన ధరలు ఏ రేంజ్ లో పెరుగుతాయనే ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే పెరుగుతూ వస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొనడం మార్కెట్లను కలవరపెడుతోంది. పరిస్థితులు ఇలాగే ఉంటే ముడిచమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును తాకుతుందని బార్‌క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. ఒకవేళ ఇదే జరిగితే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 10 వరకు పెరిగే ప్రమాదం ఉంది. భారత్ తన చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నందున, ముడిచమురు ధరలో ప్రతి ఒక డాలర్ పెరుగుదల భారత ప్రభుత్వంపై ఏటా రూ. 13,000 కోట్ల అదనపు భారాన్ని మోపుతుంది.

హార్ముజ్ జలసంధి ముప్పు – రవాణా స్తంభన

భారతదేశానికి ముడిచమురు సరఫరా అయ్యే మార్గాల్లో హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) అత్యంత కీలకమైనది. భారత్ రోజువారీగా వాడే 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురులో దాదాపు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం గుండానే వస్తుంది. ప్రస్తుతం ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుండటంతో ఈ సముద్ర మార్గంలో రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ జలసంధి గనక పూర్తిగా మూతపడితే, భారత్‌కు చమురు సరఫరా నిలిచిపోయి తీవ్రమైన ఇంధన సంక్షోభం తలెత్తుతుంది. ప్రస్తుతం మన వద్ద 76 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్రం ప్రకటించినప్పటికీ, యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ధరల పెరుగుదలను అడ్డుకోవడం కష్టతరం కావచ్చు.

వంట నూనెలు, ఎరువులపై యుద్ధ ప్రభావం

ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు, జూన్ నెలలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఎరువుల కొరత కూడా వేధించే అవకాశం ఉంది. ఎరువుల తయారీలో వాడే సల్ఫర్, సల్ఫ్యూరిక్ యాసిడ్ దిగుమతుల్లో 76 శాతం వాటా ఖతార్, యూఏఈ, ఒమన్‌లదే. యుద్ధం వల్ల ఈ సరఫరా గొలుసు దెబ్బతింటే, ఎరువుల ధరలు పెరిగి రైతాంగంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Israel-Iran War
  • Israel–Iran War Impact India
  • us
  • war
  • War Effect On India

Related News

Us Attack Iran

US Israel Iran War : ఇరాన్ పై యుద్ధం..భారత్ కు తీవ్ర నష్టం

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు కేవలం పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఆర్థిక వ్యవస్థపై ఒక భారీ సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉంది. తరచుగా మనం 'చమురు ధరల' గురించి మాత్రమే ఆందోళన చెందుతుంటాం

  • 3rd World War

    3rd World War : మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?

  • Petrol Bunks Rush

    Petrol Price Kike : మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?

  • Trump Iran

    US, Israel attack Iran : ఓపక్క దాడి చేస్తూనే..మరోపక్క చర్చలకు సిద్ధమంటున్న ట్రంప్

  • America Attack On Iran

    America Attack on Iran : ఇరాన్ పై అమెరికా దాడులకు అదే కారణమా?

Latest News

  • Escorts Kubota Limited : దక్షిణాది రైతుల కోసం ఎస్కార్ట్స్ కుబోటా సరికొత్త ట్రాక్టర్ విడుదల

  • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

  • ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్‌చిట్.. తిరుమల పర్యటన తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు : కల్వకుంట్ల కవిత

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd