CIA Plot : వెనెజులా అధ్యక్షుడు మాడురో హత్యకు సీఐఏ కుట్ర భగ్నం ?
నికోలస్ మాడురో(CIA Plot) హత్యకు వీరు కుట్ర పన్నారని తెలిపారు.
- By Pasha Published Date - 02:43 PM, Sun - 13 October 24

CIA Plot : అమెరికా పొరుగుదేశం వెనెజులా.. రష్యాకు చేరువ అవుతోంది. అమెరికా నుంచి వెనెజులా దూరం కేవలం 5300 కి.మీ. దీంతో అమెరికా ఆందోళనలో ఉంది. వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మాడురో ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ, స్పెయిన్ గూఢచార సంస్థ సంయుక్తంగా పన్నిన కుట్ర విఫలమైంది. ఈ గూఢచార సంస్థలతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను తాజాగా వెనెజులా భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి.
Also Read :Nara Rohit : గ్రాండ్‌గా నారా రోహిత్ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే
తాము అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు స్పెయిన్ దేశస్థులు, ఒక చెక్ రిపబ్లిక్ జాతీయుడు, ఒక అమెరికా పౌరుడు ఉన్నారని వెనెజులా హోం మంత్రి డియోస్డాడో కాబెల్లో వెల్లడించారు. నికోలస్ మాడురో(CIA Plot) హత్యకు వీరు కుట్ర పన్నారని తెలిపారు. తాము అరెస్టు చేసిన అమెరికన్ పౌరుడు గతంలో అమెరికా నేవీ సీల్స్ యూనిట్‌లో పనిచేశాడన్నారు. అయితే వెనెజులా ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ఎలాంటి కుట్ర పన్నలేదని అమెరికా, స్పెయిన్ దేశాలు ప్రకటించాయి. తమ దేశ పౌరుడు కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే వెనెజులాకు వెళ్లాడని.. మరో ఉద్దేశం అతడికి లేదని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. ఖైదీల మార్పిడికి సంబంధించి గత సంవత్సరమే అమెరికా – వెనెజులా ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. త్వరలోనే ఆ ఒప్పందం అమల్లోకి రానున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అమెరికాకు అత్యంత చేరువలో ఉన్న వెనెజులాతో రష్యా సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. వెనెజులాకు సైనిక సహాయాన్ని కూడా గతంలో రష్యా అందించింది. అందుకే అక్కడ సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలని అమెరికా కోరుకోవడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ వెనెజులా సైనికపరంగా నిలదొక్కుకుంటే .. అది తమకు ముప్పుగా మారొచ్చని అమెరికా అనుకుంటోందని చెబుతున్నారు.