HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us President Trump To Visit India To Meet Prime Minister Modi

Donald Trump: భారత్ రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీతో భేటీ.

  • Author : Vamsi Chowdary Korata Date : 27-06-2026 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US President Trump to visit India; to meet Prime Minister Modi.
US President Trump to visit India; to meet Prime Minister Modi.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ-ట్రంప్‌ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయని చెప్పారు.

ఈ ఏడాది చివర్లో తాను భారత్‌కు వచ్చి ట్రంప్‌ పర్యటన ఏర్పాట్లను ఖరారు చేసే అవకాశం ఉందని రూబియో వెల్లడిడించారు. వాషింగ్టన్‌లో ఐఏఎన్‌ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌ అమెరికాకు అత్యంత సన్నిహిత భాగస్వామి, మిత్రదేశమని పేర్కొన్నారు. ట్రంప్‌ తన తొలి హయాంలో 2020 ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.

ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్‌ సమావేశమయ్యారని రూబియో గుర్తు చేశారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కూడా తుది దశకు చేరుకుందని వెల్లడించారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ఒప్పందం పూర్తి కావడానికి ఇంకొన్ని అడుగుల దూరంలోనే ఉన్నామని తెలిపారు.

క్వాడ్‌ దేశాల తదుపరి సమావేశం కోసం కూడా ఎదురుచూస్తున్నట్లు రూబియో తెలిపారు. మోదీ నాయకత్వంలో భారత్‌ ప్రపంచ శక్తిగా ఎదిగిందని ప్రశంసించారు. ఇంధన రంగంలోనూ ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరుగుతోందన్నారు. భారీ క్రూడ్‌ ఆయిల్‌ను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న కీలక దేశాల్లో భారత్‌ ఒకటని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • India US Relations
  • Indian PM Narendra Modi
  • Marco Rubio

Related News

Road in Hyderabad named after Donald Trump; inaugurated by Bhatti.

Donald Trump: హైదరాబాద్‌లో రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు.. ప్రారంభించిన భట్టి

హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ రక్షణ, దౌత్య సంబంధాలకు ప్రతీకగా ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. గచ్చిబౌలి/నానక్‌రామ్‌గూడ ప్రాంతంలోని అమెరికా రాయబార కార్యాలయానికి (US Consulate) వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ (Donald Trump Avenue) గా నామకరణం చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక శిలాఫలకాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్ర

    Latest News

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    • Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

    • Paederus Beetles: అమ్మో ఏపీని వణికిస్తున్న యాసిడ్‌ పురుగులు..

    • Alcohol: మాయమ్మే… ఆ విషయంలో మగజాతిని మించిపోయారు కదా…!!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd