20 Wives VS Husband : 20 మంది ఆధ్యాత్మిక భార్యలు.. మత నాయకుడికి 50 ఏళ్ల జైలుశిక్ష ?
వాస్తవానికి 2022లో పోలీసులు సామ్యూల్‌ను(20 Wives VS Husband) అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీసు కస్టడీలోనే ఉన్నాడు.
- By Pasha Published Date - 11:16 AM, Tue - 10 December 24

20 Wives VS Husband : మత గురువు ముసుగులో ఒక వ్యక్తి రెచ్చిపోయాడు. మత గురువు హోదాలో పలువురు మహిళలను తన భార్యలుగా ప్రకటించుకున్నాడు. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే వారు తన భార్యలని.. చట్టబద్ధంగా తన భార్యలు కాదని చెప్పుకున్నాడు. అతడు దాదాపు 20 మందిని తన ఆధ్యాత్మిక భార్యలుగా అనౌన్స్ చేసుకున్నాడు. అయితే ఈ జాబితాలో 10 మంది మైనర్ బాలికలే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అమానుష ఘటనలకు అమెరికాలోని ఉతా రాష్ట్రంలో ఉన్న హిల్డేల్ నగరం, అరిజోనా రాష్ట్రంలో ఉన్న కొలరాడో నగరం వేదికలుగా నిలిచాయి. పెద్దసంఖ్యలో మహిళలను, బాలికలను తన ఆధ్యాత్మిక భార్యలుగా ప్రకటించుకున్న వ్యక్తి పేరు సామ్యూల్ బేట్ మ్యాన్. ఇతడి వయసు 48 ఏళ్లు. వాస్తవానికి 2022లో పోలీసులు సామ్యూల్‌ను(20 Wives VS Husband) అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీసు కస్టడీలోనే ఉన్నాడు.
Also Read :Telugu States : తెలంగాణ, ఏపీ విడిపోయి పదేళ్లు.. నేటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలివీ
ఎఫ్ఎల్‌డీఎస్ (FLDS) అనేది ఒక ఫండమెంటలిస్ట్ గ్రూప్. ఇందులోని గ్రూప్ సభ్యులు మహిళలను ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొంటూ లైంగిక నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఈక్రమంలో శామ్యూల్ బాటెమ్యాన్ తనని తాను ఎఫ్‌ఎల్‌డీఎస్ మత విభాగం ప్రతినిధిగా ప్రకటించుకొని కొన్ని పట్టణాల్లో చలామణి అయ్యాడు. తన అనుచరులతో పలువురు మహిళలను రప్పించుకొని వారిని తన భార్యలుగా ప్రకటించుకునేవాడని సమాచారం.
Also Read :Harmeet Dhillon: భారత వనిత హర్మీత్‌కు కీలక పదవి.. ట్రంప్ ప్రశంసలు.. ఆమె ఎవరు ?
సామ్యూల్ బేట్ మ్యాన్‌పై నమోదైన అభియోగాలు ఒకవేళ నిరూపితమైతే దాదాపు 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. తన ఆధ్యాత్మిక భార్యలుగా ప్రకటించుకున్న మైనర్ బాలికలపై సామ్యూల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర అభియోగాలు ఉన్నందున ఇక అతడికి కఠిన శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మానసిక స్థితి దెబ్బతినడం వల్లే అతడు ఆధ్యాత్మిక భార్యలను ప్రకటించుకొని ఉంటాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అతడికి మానసిక వైద్య నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు. సామ్యూల్ మానసికంగా ఫిట్ అయిన తర్వాత లాయర్‌గా వాదనలు వినిపించుకునే అవకాశాన్ని కల్పిస్తారని తెలుస్తోంది. సామ్యూల్ బేట్ బ్యాన్ తరఫున బ్రియాన్ రూసో అనే లాయర్ వాదనలు వినిపించేందుకు రెడీ అయ్యారు.