HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Control Over Venezuela Trumps Strategy As An Oil Hub

వెనిజువెలాపై అమెరికా పట్టు .. చమురు కేంద్రంగా ట్రంప్ వ్యూహం

అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు వెనిజువెలా సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు రంగాన్ని కేంద్రంగా చేసుకుని అమెరికా తన షరతులను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Author : Latha Suma Date : 08-01-2026 - 5:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
US control over Venezuela.. Trump's strategy as an oil hub
US control over Venezuela.. Trump's strategy as an oil hub

. వెనిజువెలా రాజకీయాల్లో అనూహ్య మలుపు

. చమురు ఉత్పత్తిపై అమెరికా షరతులు

. ఆర్థిక సంక్షోభం, భవిష్యత్ అనిశ్చితి

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలాపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రదర్శించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారని అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించినట్లు కథనాలు రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాల అనంతరం ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగెజ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ మార్పుల మధ్య కూడా వెనిజువెలా తన నియంత్రణలోనే ఉందని ట్రంప్ ప్రకటించడం రాజకీయంగా కొత్త ఉద్రిక్తతలకు దారి తీసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాలు వెనిజువెలా సార్వభౌమత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా చమురు రంగాన్ని కేంద్రంగా చేసుకుని అమెరికా తన షరతులను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వెనిజువెలా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉన్న చమురుపై పట్టు సాధించడం ద్వారా దేశాన్ని ఒత్తిడిలోకి నెట్టాలనే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఏబీసీ న్యూస్ నివేదిక ప్రకారం, వెనిజువెలా చమురు ఉత్పత్తిని పెంచుకోవాలంటే అమెరికా విధించిన కఠిన షరతులకు అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. కొత్త నాయకత్వం చైనా, రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో ఉన్న ఆర్థిక సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అంతేకాదు, చమురు విక్రయాల్లో అమెరికాతో మాత్రమే భాగస్వామ్యం ఉండాలని, ముఖ్యంగా హెవీ క్రూడ్ ఆయిల్‌ను ప్రాధాన్యంగా అమెరికాకే సరఫరా చేయాలని షరతులు విధించింది. ఇది వెనిజువెలాకు తీవ్రమైన దెబ్బగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ప్రస్తుతం వెనిజువెలా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేసే దేశంగా ఉంది. ఆ సంబంధాలను తెంచుకోవడం అంటే ఆదాయంలో భారీ కోత పడినట్టే. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడిని వెనిజువెలా ఎలా ఎదుర్కొంటుందనేది కీలక ప్రశ్నగా మారింది.

యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక ప్రైవేట్ సమావేశంలో మాట్లాడుతూ, వెనిజువెలా చమురు ట్యాంకర్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయని, నిల్వ చేసుకునే స్థలం లేకపోవడం వల్ల అమెరికా డిమాండ్లకు లొంగక తప్పదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. బ్లూంబర్గ్ కథనం ప్రకారం, డిసెంబర్ చివరి నుంచి వెనిజువెలా చమురు బావులను మూసివేస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఎగుమతులు నిలిచిపోవడం, నిల్వలు నిండిపోవడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. అమెరికా అంచనాల ప్రకారం, వెనిజువెలా రాజధాని కారకాస్ కొన్ని వారాల్లోనే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. చమురు అమ్మకాలు నిలిచిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. వెనిజువెలా తాత్కాలిక ప్రభుత్వం 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ చమురును అమెరికాకు అప్పగించనుందని, ఆ చమురును విక్రయించి వచ్చిన నిధులను తానే నియంత్రిస్తానని చెప్పారు. పరిణామాలు వెనిజువెలా భవిష్యత్తుపై భారీ అనిశ్చితిని మోపుతున్నాయి. అమెరికా ఆధిపత్యం వల్ల ఆ దేశం ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుందో, ఇతర దేశాలతో సంబంధాలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Cuba
  • Donald Trump
  • economic relations US foreign policy
  • Iran
  • Nicolas Maduro
  • oil production
  • russia
  • Venezuela

Related News

Iran

ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

ఈ మార్గాల ద్వారా సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్ తమ చమురు, గ్యాస్‌ను ఎగుమతి చేస్తాయి.

  • Trump Says Some Sanctions T

    Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

  • Israel-Iran War: Donald Trump

    నౌకల స్వాధీనం కంటే ముంచేయడమే సరదాగా అనిపించింది.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • New Supreme Leader Of Iran

    Iran : ఇరాన్ కు కొత్త సుప్రీం లీడర్

  • Gold Deal

    అమెరికా- వెనిజులా మధ్య గోల్డ్ డీల్‌!

Latest News

  • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

  • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd